ICC Champions Trophy 2025 Live Streaming Details in Telugu: ప్రపంచ క్రికెట్ ప్రేమికులకు ప్రపంచకప్ తరువాత అంతటి ప్రాధాన్యత కలిగింది ఛాంపియన్స్ ట్రోఫీ. ఫిబ్రవరి 19 నుంచి మార్చ్ 9 వరకూ పాకిస్తాన్, యూఏఈ వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 8 జట్లు 15 మ్యాచ్‌లతో తలపడనున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ తొలిసారిగా ట్రోఫీ ఆడుతుంటే, శ్రీలంక దూరమైంది. ఫిబ్రవరి 19న తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది.
దాదాపు 8 ఏళ్ల విరామం తరువాత ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. మొత్తం 8 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. రెండు గ్రూప్‌లు ఉంటాయి గ్రూప్ ఎలో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉంటే గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ ఉన్నాయి. ఇప్పటికే 8 దేశాలు తమ జట్లను ప్రకటించాయి. 2017లో చివరిసారిగా ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ విరాట్ కోహ్లీ సారధ్యంలో ఆడగా ఈసారి రోహిత్ శర్మ నేతృత్వంలో ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రత్యక్ష ప్రసారాన్ని ఏ దేశంలో ఏ ఛానెల్‌లో చూడవచ్చో ఆ వివరాలు మీ కోసం.
ఇండియాలో ప్రత్యక్ష ప్రసారం వివరాలు
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రత్యక్ష ప్రసారాలను ఇండియాలో జియో స్టార్ నెట్‌వర్క్‌లో చూడవచ్చు.16 విభిన్న ప్రాంతీయ భాషల్లో ఈ ప్రసారాన్ని వీక్షించవచ్చు. దీంతోపాటు స్టార్ స్పోర్ట్స్, నెట్‌వర్క్ 18 ఛానెళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.
ఇతర దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం వివరాలు
పాకిస్తాన్‌లో పీటీవీ, టెన్ స్పోర్ట్స్ , మైకో, తమాషా యాప్స్
యూఏఈలో Criclife Max, Criclife Max 2
యునైటెడ్ కింగ్‌డమ్‌లో స్కై స్పోర్ట్స్ క్రికెట్, స్కై స్పోర్ట్స్ మెయిన్ ఈవెంట్, స్కై స్పోర్ట్స్ యాక్షన్, స్కై గో, స్కై స్పోర్ట్స్ యాప్
యూఎస్ఏ-కెనడాలో Willow Tv
కరేబియన్ దీవుల్లో ESPN
ఆస్ట్రేలియాలో ప్రైమ్ వీడియో
న్యూజిలాండ్ స్కై స్పోర్ట్స్ NZ
దక్షిణాఫ్రికాలో సూపర్ స్పోర్ట్స్, సూపర్ స్పోర్ట్స్ యాప్
బంగ్లాదేశ్‌లో నగోరిక్ టీవీ, టీ స్పోర్ట్స్
ఆఫ్ఘనిస్థాన్‌లో ఏటీఎన్
శ్రీలంకలో మహారాజా టీవీ, సిరస యాప్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి