Gold Rate Today: బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. నిన్న స్వల్పంగా దిగివచ్చిన బంగారం ధర నేడు కూడా అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతోంది. మళ్లీ పెరగకముందే బంగారం కొనుగోలు చేయడం మంచిది. అమెరికా టారిఫ్ ల నిర్ణయాలతో బంగారం ధరలు మరింత దూసుకెళ్లు ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 17వ తేదీ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. వరుసగా మూడోరోజు కూడా బంగారం ధర తగ్గింది. అయితే గత కొన్నాళ్లుగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీంతో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి బంగారం మంచి ఇన్వెస్ట్ గా నిలుస్తోంది. బంగారంతోపాటు వెండికి కూడా మంచి గిరాకీ ఉంది. వెండి ధరలు కూడా ఇటీవల రికార్డ్ గరిష్టాలకు చేరుకున్నాయి. అందుకే ఈ రెండింటి ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అవసరం.
ఈ మధ్య కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస టారిఫ్ నిర్ణయాలు ప్రపంచ వాణిజ్యలో అనిశ్చిత పరిస్థితులకు దారితీస్తున్నాయి. అది కాస్త బంగారం ధరలు పెరిగేందుకు కారణంగా మారుతున్నాయి.
భారత్ తోపాటు చాలా దేశాలపై టారిఫ్స్ విధిస్తామని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. దీంతో చాలా మంది సురక్షిత పెట్టుబడి బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు.
దీంతో బంగారం ధరలు రికార్డ్ గరిష్టాలకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 17వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డ్ గరిష్టాల్లోనే కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2882 డాలర్ల దగ్గర కొనసాగుతోంది. ఇక స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 32 డాలర్ల పైనే కొనసాగుతోంది.
భారత కరెన్సీ రూపాయి విలువ ప్రస్తుతం రూ. 86.76స్థాయిల్ ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు క్రితం రోజు స్వల్పంగా దిగివచ్చాయి. నిన్నటి రేటు వద్దే కొనసాగుతున్నాయి
ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 78,900వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 24క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏ మార్పు లేకుండా 86,070 వద్ద కొనసాగుతోంది.