School Holiday: విద్యార్థులకు శుభవార్త.. నేడు ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు..!

School Holiday Today: విద్యార్థులకు మరోసారి స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలోని స్కూలు కాలేజీలకు నేడు సెలవు ఉంది. దీంతో విద్యార్థులకు ఇది పండుగ లాంటి వార్త. ఇక ఈ నెల 26 శివరాత్రి మరుసటి రోజు ఎన్నికల పద్యంలో కూడా వరుసగా రెండు రోజులు స్కూలుకు సెలవు రానుంది. అయితే నేడు ఏ జిల్లాలో స్కూల్లోకి సెలవు ఉంది పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

నేడు సూర్యపేట చివ్వంలోని పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతర నేపథ్యంలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఈ జిల్లాలోని స్కూల్లు, కాలేజీలు బంద్ ఉన్నాయి.. లింగమంతుల స్వామి జాతర నిన్న ప్రారంభమైంది.  

2 /5

ఈనేపథ్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాలో అన్ని స్కూల్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ సెలవుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు నేడు బంద్ పాటిస్తున్నాయి.  

3 /5

ఇక ముఖ్యంగా పెద్దగట్టు జాతర మేడారం తర్వాత అతిపెద్ద జాతరగా పేరుగాంచింది. ఈ జాతరకు 25 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతర ప్రాంతంలో పటిష్ట భద్రత కూడా ఏర్పాటు చేశారు.  

4 /5

ఈ జాతర కేసారం నుంచి పెద్దగట్టు రాకతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మొత్తంగా ఐదు రోజులపాటు నిర్వహించే ఈ పెద్దగట్టు జాతర తెలంగాణలోనే మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు.  

5 /5

ఇక భక్తులు జాతరకు పెద్ద సంఖ్యలో రానున్న నేపథ్యంలో ఆయా ప్రాంతంలో ట్రాఫీక్‌ నిబంధనలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నార్కెట్‌పల్లి మిర్యాలగూడ, కోదాడ మీద విజయవాడకు మళ్ళిస్తున్నారు. అలాగే విజయవాడ నుంచి వచ్చే వాహనాలను కూడా నార్కెట్పల్లి మీదుగా హైదరాబాద్ కు మళ్ళిస్తున్నారు.