Jio Affordable Plan: రిలయన్స్ జియో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్లను తీసుకువస్తుంది. ఈ రీఛార్జీ ప్యాక్‌పై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. రిలయన్స్ జియో రీఛార్జ్ ప్యాక్ ధరలు అత్యంత చీప్ గా ఉంటాయి. అందులో ఎక్కువ బెనిఫిట్స్ కూడా పొందుతారు. ఈ ప్యాకలో అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు.. అన్ లిమిటెడ్ డేటా కూడా పొందుతారు. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
నెలపాటు లాంగ్ టైం వ్యాలిడిటీ ప్లాన్ ఉన్న రీఛార్జ్ కోసం ఎదురు చూస్తున్నారా? మీరు కూడా జియో యూజర్స్ అయితే ఈ జియో ప్లాన్ లో మీకు ఎక్కువ లాభాలు తెచ్చి పెడుతుంది. ఇందులో మీరు అపరిమిత ఇంటర్నెట్ డేటా పొందుతారు. దీంతో పాటు మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఈ ప్లాన్ ధర కేవలం రూ.355 దీని వ్యాలిడిటీ 30 రోజులపాటు ఉంటుంది. మీకు మొత్తంగా 25 జీబీ డేటా లభిస్తుంది. ఇందులో మీరు డేటా అపరిమితంగా వాడుకోవచ్చు. ఒక్కరోజులో ఎంత జీబీ అయినా వినియోగించుకోవచ్చు. వారంలో పూర్తి జీబీ కూడా వాడొచ్చు. 25 జిబి డేటా పూర్తయిన తర్వాత మీరు 64 కేబిపిఎస్ ఇంటర్నెట్ స్పీడ్ పొందుతారు.
30 రోజులపాటు ఈ ప్లాన్ వర్తిస్తుంది. మీ ఏరియాలో 5 జి సేవలు అందుబాటులో ఉంటే.. మీరు 5g స్పీడ్ డేటా కూడా పొందగలరు. అయితే ఈ జియో రూ.350 ప్లాన్ తో పాటు జియో సినిమా, జియో టీవీ, జియో సెక్యూరిటీ కూడా ఉచితంగా యాక్సెస్ పొందుతారు.
ఈ రీఛార్జ్ ప్లాన్ తో మీరు ఏ నెట్వర్క్ అయినా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇందులో 100 ఎస్ఎంఎస్‌లు ప్రతిరోజూ ఉచితంగా పొందుతారు. ఇంకా రిలయన్స్ జియో ఈ వ్యాలిడిటీ 30 రోజుల పాటు వర్తిస్తుంది. మీరు షార్ట్ టర్మ్ వ్యాలిడిటీ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ప్లాన్.
ట్రయ్ ఆదేశాల మేరకు ఇటీవల రిలయన్స్ జియో కూడా వాయిస్ ఓన్లీ ప్లాట్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఫీచర్ ఫోన్ ఉపయోగించే కస్టమర్లు అదనంగా డేటా కోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. తక్కువ ధరలోనే కేవలం వాయిస్ ప్లాన్స్ ఖర్చుతో రీఛార్జ్ ప్యాక్స్ పొందవచ్చు.