Ap minister comments on ys Bharathi video viral: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం టీడీపీ వర్సెస్ వైసీపీగా మారిపోయింది. ఇటీవల అధికారంలోకి వచ్చి కూటమి సర్కారు ఒకవైపు ఏపీప్రజలకు మంచి పాలన అందిస్తునే మరొవైపు గత సర్కారు చేసిన తప్పిదాలను ప్రజల ముందుంచుతుంది. అంతేకాకుండా.. ఎప్పటికప్పుడు మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన అనుచరులు చేసిన ఆగడాలను, భూదందాలను, స్కామ్ లను కూటమి సర్కారు బైటకు తీస్తుంది. ఇప్పటికే వైసీపీకి చెందిన అనేక మంది నేతలపై ఇప్పటికే అధికారులు కేసులు సైతం పెట్టారు.
Nara Lokesh Ragging CEMENT AUNTY #Bharathi Reddy
😹😹😹😹😹🤣🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/vDyonucckJ
— 𝘚𝘸𝘦𝘵𝘩𝘢 𝘊𝘩𝘰𝘸𝘥𝘢𝘳𝘺 🎀 (@vibeofswetha) February 15, 2025
గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు.. టీడీపీ నేతల్ని ముప్పుతిప్పలు పెట్టారు. ముఖ్యంగా నారాలోకేష్ ను ఇష్టమున్నట్లు ట్రోల్స్ చేసేవాళ్లు. అయితే.. ఆయన తమపై, కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులోపై మండిపడేవారు. రెడ్ బుక్ లో అంత ఎంట్రీ చేస్తున్నామని అధికారంలోకి రాగానే.. వడ్డీతో సహా చెల్లిస్తామని కూడా నారాలోకేష్ కౌంటర్ ఇచ్చే వారు. కూటమి సర్కారు అనూహ్యంగా ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి నారాలోకేష్ అనేక సందర్భాలలో మీడియా సమావేశంలో సాక్షి ప్రతినిధుల మీద ఒక రేంజ్ లో సెటైర్ లు వేస్తున్నారు.
సాక్షి రిపోర్టర్ వచ్చాడా.. అంటూ సెటైర్ లు వేసేవారు. అందరి మధ్యలో..సాక్షివాళ్లను ప్రత్యేకంగా పిలిచి మరీ మాట్లాడేవాళ్లు. అయితే.. తాజాగా.. నారా లోకేష్ మరోసారి సాక్షిప్రతినిధి మీద తనదైన స్టైల్ లో సెటైర్ లు వేశారు. మీ మేడం వైఎస్ భారతీ చాలా రోజుల తర్వాత ఇప్పుడిప్పుడే ఆఫీస్ వచ్చారంటగా.. అంటూ సెటైర్ లు వేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంత నవ్వుకున్నారు. నారాలోకేష్ సెటైరీకల్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
మరొవైపు వైసీపీ నేతలు..రాజకీయాల్లో నేతల భార్యల గురించి మాట్లాడుతూ.. వెటకారంగా ప్రవర్తించడం ఎంత వరకు సబబు అని ఫైర్ అవుతున్నారు. మరికొందరు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయోద్దని కూడా నారా లోకేష్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు.
దీనిపై టీడీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. గతంలో చంద్రబాబు సతీమణి గురించి .. నోటికొచ్చినట్లు మాట్లాడినప్పుడు ఈ నొప్పి తెలీలేదా అంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు . మొత్తానికి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter