Wrong UPI Payment: ఈ డిజిటల్ యుగంలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ద్వారా చెల్లింపులు చేపడుతున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్స్‌పై ఎక్కువగా చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే, ఎప్పుడైనా తప్పు నంబర్‌కు యూపఐ చెల్లింపులు చేస్తే ఏం చేయాలి? ఆ పూర్తి వివరాలు ఇవే..
యూపీఐ పేమెంట్ చేసినప్పుడు ఎప్పుడైనా తప్పు నంబర్‌కు చెల్లింపులు చేశారా? ఆ తర్వాత డబ్బులు కోల్పోయామని తలలు పట్టుకుంటారు. అయితే, తప్పు నంబర్‌కు యూపీఐ చెల్లింపులు చేసినప్పుడు ఏం చేయాలి?
తప్పు నంబర్‌కు యూపీఐ ట్రన్స్‌ఫర్ అయినప్పుడు ఇలా చేయండి.. మొదట పేమెంట్ యాప్ (ఫోన్‌పే, గూగుల్ పే) ఓపెన్ చేయాలి అక్కడ ట్రాన్సక్షన్ హిస్టరీలో రిసిపీయంట్ వివరాలు వెరిఫై చేయాలి. యూపీఐ ఐడీ లేదా ఫోన్ నంబర్ కూడా నమోదు చేయాలి. ఇప్పుడు ఆ టాన్సక్షన్ స్క్రీన్ షాట్ తీసిపెట్టుకోవాలి.
మీకు తెలిసిన ఫోన్ నంబర్‌కు చెల్లింపు చేస్తే వారిని రీఫండ్ కోసం రిక్వెస్ట్ చేయండి. ఒకవేళ తెలియని నంబర్‌కు చెల్లింపు చేస్తే వారిని కాంటాక్ట్ చేసి రీఫండ్ రిక్వెస్ట్ చేయండి.
గూగుల్ పే చేస్తే ప్రోఫైల్‌లో హెల్ప్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ 'Are you Having Issues' ఎంపిక చేసుకుని పేమంట్ ఇష్యూ సెలక్ట్ చేసుకోవాలి. ఇదే ఫోన్ పే, పేటీఎం లో కూడా ఫాలో అవ్వాలి.
ఇది కాకుండా మీ బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌ను సంప్రదించండి. మీ చెల్లింపు వివరాలు వారికి షేర్ చేయండి. మీ బ్యాంకుకు మీ చెల్లింపులు రివర్స్ చేసే సదుపాయం కల్పిస్తోంది. బ్యాంకు వల్ల కాకపోతే ఆన్‌లైన్‌లో ఆర్‌బీఐ ఒంబుడ్స్‌మెన్‌కు కంప్లైంట్ చేయవచ్చు.