Virtual Aadhaar ID Download: మన దేశంలో ఆధార్ కార్డు ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు.. ఇది తప్పనిసరి. దీన్ని మనం ఐడి ప్రూఫ్‌లా ఉపయోగిస్తాం. ఆధార్ కార్డు కోల్పోతే సమస్యలు తప్పవు. ఆధార్ కార్డుని ఎక్కడికి అంటే అక్కడికి తీసుకెళ్లడం సాధ్యం కాదు. దీనికి బదులుగా వర్చువల్ ఆధార్ ఐడిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవసరమైన చోట ఈ ఐడిని ఉపయోగించవచ్చు.
సాధారణ ఆధార్ కార్డు కాకుండా వర్చువల్ ఆధార్ కార్డు, ఇ ఆధార్ కార్డు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ సర్వీస్ ని ఉపయోగించుకోవచ్చు. ఫిజికల్ ఆధార్ కార్డును మీరు తీసుకెళ్లే బదులు ఈ వర్చువల్ ఐడీని ఉపయోగించవచ్చు. ఈరోజు వర్చువల్ ఆధార్ కార్డు అంటే ఏంటి? దీన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి తెలుసుకుందాం..
వర్చువల్ ఆధార్ కార్డు (VID)ను సాధారణ ఆధార్ కార్డు మాదిరి ఉపయోగిస్తారు. దీన్ని సులభంగా డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించవచ్చు. ఆధార్ కార్డులో 16 డిజిట్స్ నెంబర్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్ టాప్ లో కూడా దీన్ని మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే వర్చువల్ ఐడిని కేవలం ఒకసారి మాత్రమే ఉపయోగించాలి. కానీ దీన్ని మీరు ఎన్నిసార్లు అయినా జనరేట్ చేసుకునే సదుపాయం ఉంది.
యుఐడిఏఐ (UIDAI) జారీ చేసిన సాధారణ ఆధార్ కార్డు మాదిరి ఇది వర్చువల్ ఐడి కూడా జారీ చేస్తుంది. దీనికి మీరు యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఆధారంగా వర్చువల్ ఐడిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వర్చువల్ ఐడి డౌన్‌లోడ్ చేసుకునే విధానం.. ముందుగా యుఐడిఏఐ అధికారిక వెబ్‌సైట్ అయిన https://uidai.gov.in/ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ సర్వీస్ లోకి వెళ్లి వర్చువల్ ఐడి (VID) జనరేటర్ ఎంపిక చేసుకోవాలి. అక్కడ మీ ఆధార్ నంబరు, క్యాప్చ కోడ్ కూడా నమోదు చేయాలి.
ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. దీంతో మీ వర్చువల్ ఐడి జనరేట్ అయినట్టే. మీకు 16 డిజిట్ల వర్చువల్ ఐడి మొబైల్ ఫోన్ కి వస్తుంది. ఇలా కాకుండా మీరు ఎస్ఎంఎస్ పంపించి కూడా వర్చువల్ ఐడిని జనరేట్ చేసుకోవచ్చు. దీనికి 1947 నంబర్ కి మెసేజ్ చేయాలి.