India Vs England Dream11 Team Tips and Playing 11: ఇంగ్లాండ్‌తో టీమిండియా నేడు రెండో వన్డేలో తలపడనుంది. మొదటి వన్డేలో విజయం సాధించిన భారత్.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే.. మరో గేమ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంటుంది. రెండో వన్డేకు విరాట్ కోహ్లీ అందుబాటులోకి వచ్చేశాడు. దీంతో ఎవరిపై వేటు పడుతుందోనని ఇంట్రెస్టింగ్‌గా మారింది. యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్‌లో ఒకరు కోహ్లీ కోసం త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇక వరుణ్ చక్రవర్తి కూడా కుల్దీప్ యాదవ్ స్థానంలో తుది జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. తుది జట్టు విషయం పక్కనపెడితే.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ ఫ్యాన్స్‌ను కలవరపరుస్తోంది. ఈ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ ఫామ్‌లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కటక్‌లోని బారాబతి స్టేడియం ఆదివారం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డులు, తుది జట్లు, డ్రీమ్11 టీమ్ టిప్స్ వివరాలు మీ కోసం..
పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే.. బారాబతి వేదికలో జరిగిన చివరి మూడు వన్డే మ్యాచ్‌లలో స్కోర్‌లను మనం పరిశీలిస్తే.. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. బ్యాట్స్‌మెన్ పండగ చేసుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం మొదటి ఇన్నింగ్స్ 25-30వ ఓవర్ సమయంలో పిచ్ స్పిన్నర్లకు సహాయపడవచ్చు. రెండో ఇన్నింగ్స్‌లో ట్రాక్ బ్యాటింగ్‌కు మెరుగ్గా ఉండవచ్చు. లక్ష్యాన్ని ఛేదించడానికి అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన టీమ్ బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. మ్యాచ్ సమయంలో అత్యధిక ఉష్ణోగ్రత 33°C ఉంటుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పులేదు.
హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. భారత్-ఇంగ్లాండ్ మొత్తం 108 వన్డేల్లో తలపడ్డాయి. వీటిలో టీమిండియా 59 మ్యాచ్‌లు గెలుపొందగా.. ఇంగ్లాండ్ 44 వన్డేల్లో విజయం సాధించింది. 2 మ్యాచ్‌లు టైగా ముగియగా.. 3 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన మరోసారి ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
తుది జట్లు ఇలా.. (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, హర్షిత్ రాణా
ఇంగ్లాండ్: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్
IND Vs ENG Dream11 Team Tips:
==> వికెట్ కీపర్: జోస్ బట్లర్
==> బ్యాటర్స్: విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, జో రూట్
==> ఆల్ రౌండర్స్: అక్షర్ పటేల్, జాకబ్ బెథెల్
==> బౌలర్స్: ఆదిల్ రషీద్, కుల్దీప్ యాదవ్, జోఫ్రా ఆర్చర్, హర్షిత్ రాణా
కెప్టెన్: శుభ్‌మన్ గిల్
వైస్-కెప్టెన్: జోస్ బట్లర్
Also Read: AP: బాబోయ్ మండే ఎండలు.. వేడి వాతావరణం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..
Also Read: Telangana Politics: రూట్ మార్చిన ఎమ్మెల్యే.. ఇద్దరు మంత్రులతో స్నేహ హస్తం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.