Champions Trophy 2025: వన్డేల్లో ప్రపంచకప్ తర్వాత.. అత్యంత ఆసక్తి రేకెత్తించేది ఛాంపియన్స్ ట్రోఫీనే. 2017 తర్వాత రద్దయి, మళ్లీ ఇప్పుడు ప్రారంభం అవుతున్న టోర్నీకి పాకిస్థాన్, యూఏఈ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఆతిథ్య జట్టు పాకిస్థానే అయినప్పటికీ.. ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ అంగీకరించని నేపథ్యంలో, రోహిత్ సేన ఆడే మ్యాచ్‌లకు దుబాయ్ వేదికగా ఆడనుంది.
అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న భారత్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటి. నేడు పాకిస్థాన్, న్యూజిలాండ్ తొలి మ్యాచ్‌లో తలపడతాయి. గురువారం బంగ్లాదేశ్ మ్యాచ్‌తో భారత్ తన పోరాటాన్ని ఆరంభిస్తుంది. వీటితో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ టోర్నీలో తలపడనున్నాయి. వెస్టిండీస్, శ్రీలంక టోర్నీకి అర్హత సాధించలేకపోయాయి.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఎప్పుడో 1996లో వన్డే ప్రపంచకప్‌నకు భారత్, శ్రీలంకలతో కలిసి ఉమ్మడిగా ఆతిథ్యమిచ్చింది పాకిస్థాన్. ఆ తర్వాత ఆ దేశంలో ఏ ఐసీసీ టోర్నీ జరగలేదు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాక్.. ప్రదర్శన పరంగా కూడా తన ప్రత్యేకతను చాటాలనుకుంటోంది. సొంతగడ్డపై భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్న ఆ జట్టు.. టోర్నీలో శుభారంభం చేయాలని ఆశిస్తోంది. అయితే తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ రూపంలో ఆ జట్టుకు కఠిన సవాలే ఎదురవుతోంది. ఈ టికెట్ ధరలు.. కామన్ రూ. 5912.. అత్యధికంగా రూ. 47,300 ఉంది. మరోవైపు పాకిస్థాన్ లో ఈ టికెట్ ధరలు.. రూ. 1000.. రూ. 25,000 ఉన్నాయి. మొత్తంగా ఈ మ్యాచ్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..? \
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.