female power lifter dies in rajasthan: సాధారణంగా చాలా మంది జిమ్ లు చేస్తుంటారు. కానీ జిమ్ లు చేసేటప్పుడు కోచ్ సూచనల్ని తప్పకుండా పాటించాలి. కొన్ని సార్లు జిమ్ లో రాడ్ లు ఎత్తేటప్పుడు అనుకొని ఘటనలు జరుగుతుంటాయి. కొంత మంది ఒకేసారి బాగా బరువున్న రాడ్ లను ఎత్తేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి క్రమంలో రాడ్ మీద పడితే.. ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. తాజాగా.. ఒక యంగ్ లిఫ్టర్ జిమ్ లో ట్రైనింగ్ తీసుకుంటుంది. అయితే.. ఆమె తన ట్రైనర్ పక్కనే ఉండి.. 270 కేజీల రాడ్ ఎత్తడంపై ట్రైనింగ్ ఇస్తున్నాడు.
⚠️ Disturbing Visual ⚠️
राजस्थान : बीकानेर में पावरलिफ्टर याष्टिका आचार्य (उम्र 17 साल) की जिम में मौत हो गई। 270 किलो वजन उठाते वक्त रॉड गिरने से गर्दन की हड्डी टूट गई। pic.twitter.com/SdJKab00od
— Adil Khan Aimim Gazipur (@AdilKha70224152) February 19, 2025
కానీ సెకన్ ల వ్యవధిలోనే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని బికనీర్ కు చెందిన పవర్ లిప్టర్ యష్తిక ఆచార్య ఆచార్యకు చిన్నతనం నుంచి వెయిట్ లిప్టింగ్ లో తనకంటూ ప్రతిభకనబర్చింది. దీంతో ఆమెకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇప్పించారు. ఆమె కేవలం 17 వయసులోనే.. జూనియర్ నేషనల్ గేమ్స్ విభాగంలో.. గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకుంది. అయితే.. తాజాగా.. ఆమె 270 కేజీల బరువు ఎత్తడం విభాగంలో భాగంలో జిమ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుంటుంది. ఆమె తన మెడ మీద 270 కేజీల రాడ్ ను ఎత్తుతుంది. అప్పుడు ఆమె వెనకాలే ట్రైనర్ కూడా ఉన్నాడు.
ఇంతలో ఏమైందో.. ఆమె చేతిలో నుంచి రాడ్ పట్టుతప్పింది. వెంటనే అది కాస్త ఆమె మెడ మీద పడింది. దీంతో ఆమె కుప్పకూలీ పడిపోయింది. ఆమె తల ఒక్కసారిగా జిమ్ ట్రైనర్ ముఖానికి తగిలింది. ఆమె మెడ మీద 270 కేజీల రాడ్ పడి పెద్ద శబ్దంతో కింద పడిపోయింది. చూస్తుండగా.. ఆమె నెల మీద మాటలు లేకుండా.. మూర్చపోయింది. వెంటనే అక్కడున్న వాళ్లు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. కానీ అప్పటికే యష్తిక చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
ఆమె మెడ మీద బలంగా పడటంతో మెడలోని ఎముకలు, నరాలు పూర్తిగా దెబ్బతిని స్పాట్లోనే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. జిమ్ ట్రైనర్ కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. దీనిపై ఎలాంటి పోలీసు కంప్టైంట్ రాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి