Dhanashree Verma How Much Received Alimony From Yuzvendra Chahal: గతేడాది అత్యధిక జంటలకు పెళ్లిలవగా.. అత్యధికంగా జంటలు కూడా విడిపోయాయి. వారిలో క్రికెట్ జోడీ ఒకటి ఉంది. రూ.60 కోట్లు తీసుకుని ఆ స్టార్ క్రికెటర్‌ను అతడి భార్య వదిలేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త హల్‌చల్ చేస్తోంది. ఇంతకి ఎవరు? ఏమిటా వివరాలో తెలుసుకుందాం.
గతేడాది పెద్ద సంఖ్యలో జోడీలు విడిపోయాయి. కొన్నేళ్లుగా కలిసి ఉన్న తమ అనుబంధాన్ని తెంపేసుకున్నారు. వారిలో స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ కూడా ఉన్నాడు. తన భార్య ధనశ్రీ వర్మతో తెగదెంపులు చేసుకున్నారని తెలుస్తోంది.
యుజ్వేంద్ర చాహల్ 2020లో కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల వరకు వీరి కాపురం సవ్యంగా సాగింది. అయితే కొన్నాళ్లకు వీరి మధ్య విబేధాలు కొనసాగగా చివరకు వారిద్దరూ 2024లో విడిపోయినట్లు తెలుస్తోంది.
వీరిద్దరూ విడిపోయిన సమయంలో యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ మధ్య ఆర్థిక ఒప్పందం కూడా జరిగిందని సమాచారం. ఆ ఒప్పందం వివరాలు విస్తుగొల్పుతున్నాయి.
విడాకుల కేసులో భరణం నిర్ణయించేటప్పుడు కోర్టు యుజ్వేంద్ర చాహల్ సంపాదన.. ధనశ్రీ వర్మ సొంత ఆదాయాలను పరిశీలిస్తారు. చాహల్ కన్నా అధికంగా ధనశ్రీ సంపాదిస్తుంటే ఆమెకు భరణం ఇచ్చే అవకాశం లేదు. కానీ చాహల్ కన్నా తక్కువగా ఉండడంతో కోర్టు ధనశ్రీకి భరణం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఐపీఎల 2025లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న చాహల్ ధర రూ.18 కోట్లు ఉండడంతో వీటితో కలిపి చాహల్ మొత్తం ఆస్తులు రూ.45 కోట్లకు చేరాయి.
కొరియోగ్రాఫర్, దంత వైద్యురాలుగా ఉన్న ధనశ్రీ వర్మ రూ.25 కోట్ల ఆస్తులు కలిగి ఉంది. చాహల్‌తో విడిపోతున్న సమయంలో ధనశ్రీకి రూ.60 కోట్లు భరణంగా చెల్లించేందుకు అంగీకరించినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి.
విడిపోయిన వారిద్దరూ వేర్వేరుగా వారి వారి ఇళ్లలో ఉంటున్నారు. విడాకుల అనంతరం ధనశ్రీ వర్మ ముంబైలో తన తల్లితో నివసిస్తోందని సమాచారం. ఇక చాహల్ గుర్గావ్‌లో తన కుటుంబసభ్యులతో ఉంటున్నాడు. ముంబైలో కూడా అతడికి నివాసం ఉందని తెలుస్తోంది.