IND vs ENG Dream11 Prediction Today Match: ఇంగ్లాండ్‌పై వరుసగా రెండు వన్డేల్లో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకున్న భారత్.. మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. రెండో వన్డేలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇదే చివరి వన్డే కావడంతో తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్, హర్షిత్ రాణా స్థానంలో రిషభ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ద్వారా అయినా ఫామ్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అహ్మాదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది..? రెండు జట్లు ప్లేయింగ్ 11 ఎలా ఉండనుంది..? డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..
నరేంద్ర మోదీ స్టేడియం పిచ్.. బ్యాటర్లు, బౌలర్లు ఇద్దరికీ సమానంగా ఉంటుంది. మంచి బౌన్సీ ఉంటుంది. ఆరంభంలో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ.. పిచ్ స్థిరపడుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు మెరుగ్గా సహకరిస్తుంది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు కీలకం అవుతారు. మొదటి ఇన్నింగ్స్‌లో 270+ స్కోరు పోటీగా ఉంటుంది. మ్యాచ్ సమయంలో ఆకాశం నిర్మలంగా ఉంటుందని.. వర్షం పడే అవకాశం లేదని భావిస్తున్నారు. గరిష్ట ఉష్ణోగ్రత దాదాపు 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని.. కనిష్ట ఉష్ణోగ్రత సాయంత్రం 15 డిగ్రీలకు పడిపోవచ్చని అంచనా. తేమ స్థాయి దాదాపు 38 శాతం ఉంటుంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం లేదు.
తుది జట్లు ఇలా.. (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి
ఇంగ్లాండ్: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, టామ్ బాంటన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్.
IND Vs ENG Dream11 Team:
వికెట్ కీపర్: ఫిలిప్ సాల్ట్ (వైస్ కెప్టెన్)
బ్యాటర్లు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), జో రూట్, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, బెన్ డకెట్
ఆల్ రౌండర్లు: లియామ్ లివింగ్‌స్టోన్
బౌలర్లు: ఆదిల్ రషీద్, అర్ష్‌దీప్ సింగ్, జోఫ్రా అర్చర్, మహ్మద్ షమీ.
Also Read: ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
Also Read: Gold Rate Today: అందనంత ఎత్తుకు బంగారం ధరలు.. తులం లక్ష దిశగా పరుగులు.. నేటి ధరలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.