Valentines Day: భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్‌ను ప్రాణాలతో కాపాడిన వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ప్రేమికుల ముందు రోజే అతడు తన ప్రేయసితో కలిసి విషం తాగాడు. ఇది చూసిన కుటుంబసభ్యులు, స్నేహితులు ప్రియురాలు, ప్రియుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించి ప్రియురాలు కన్నుమూయగా.. పంత్‌ను కాపాడిన వ్యక్తి ప్రస్తుతం కొనప్రాణాలతో ఉన్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
Also Read: Meat In Temple: ఆలయంలో మాంసం ఘటనలో బిగ్ ట్విస్ట్.. ఏం జరిగిందంటే?
పెళ్లికి నిరాకరణ
ఉత్తరాఖండ్‌లోని రూర్కీ వద్ద 2022 డిసెంబర్‌లో రిషబ్ పంత్‌కు ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కారు ప్రమాదానికి గురయి మంటల్లో కాలిపోగా తీవ్ర గాయాలతో పంత్ పడి ఉన్నాడు. ఆ సమయంలో రిషబ్‌ను ఇద్దరు వ్యక్తులు కాపాడారు. కాపాడిన వారిలో 25 ఏళ్ల రజత్ కుమార్ ఒకడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్‌నగర్ జిల్లా బుచ్చా బస్తీ గ్రామానికి చెందిన రజత్ కుమార్ మనూ కశ్యప్ అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే వీరి ప్రేమకు కుటుంబసభ్యులు అంగీకారం తెలపలేదు. సామాజిక వర్గం వేరు కావడంతో ఇరు కుటుంబసభ్యులు వీరి ప్రేమకు అభ్యంతరం చెప్పారు. ఈ గొడవల సమయంలో మనూకు వేరే పెళ్లి చేసే ప్రయత్నం చేశారు.
Also Read: Success Story: చిల్లీగవ్వ లేకుండా రైలు ఎక్కిన ఆ టీనేజర్.. ఇప్పుడు రూ.లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం
విషం తాగి
ఒకరినొకరు విడిపోవడం ఇష్టం లేక.. వేరే పెళ్లి చేసుకోలేక రజత్ కుమార్, మనూ కశ్యప్ ఇద్దరూ ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 9వ తేదీన ఇద్దరు ప్రేమికులు విషం తాగి ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నించారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు, వారి స్నేహితులు వెంటనే వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు. అయితే మనూ పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయింది. పంత్‌ను కాపాడిన రజత్ కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అతడికి ఆస్పత్రిలో చికిత్స అందుతోంది.
తనను కాపాడిన వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడనే సమాచారం రిషబ్ పంత్‌కు తెలిసిందని సమాచారం. అతడి ఆరోగ్య పరిస్థితిపై పంత్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. కాగా పంత్‌కు ప్రమాదం జరిగిన సమయంలో రజత్ కుమార్, నిషూ కుమార్ ఇద్దరు కారు నుంచి బయటకు తీసి కాపాడారు. తనను ప్రాణాలతో కాపాడిన వారికి రిషబ్ పంత్ బైక్‌లు కానుకగా అందించిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.