Champions Trophy 2025 Timetable: 8 ఏళ్ల విరామం తరువాత ఎట్టకేలకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. పాకిస్తాన్, యూఏఈ వేదికలపై జరగనున్న ఈ ట్రోఫీకు పాకిస్తాన్ ఆతిధ్య దేశంగా ఉంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చ్ 9 వరకు టోర్నీ జరగనుంది. 1996 తరువాత తిరిగి ఈ టోర్నీని పాకిస్తాన్ నిర్వహిస్తోంది. ఇండియాతో ఉన్న రాజకీయ వైరుధ్యాల కారణంగా యూఏఈ తటస్థ వేదికగా కొన్ని మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫుల్ షెడ్యూల్ ఇలా ఉంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో 8 జట్లు రెండు గ్రూప్‌లుగా ఉంటాయి. ఈ టోర్నీలో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా దేశాలు పాల్గొంటున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ తొలిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతుంటే శ్రీలంక ఆడటం లేదు. దుబాయ్ తటస్థ వేదిక కాగా మిగిలిన మ్యాచ్‌లు లాహోర్, కరాచీ, రావల్పిండిలో జరుగుతాయి. గ్రూప్ ఎలో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఉంటే గ్రూప్ బిలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా,ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైమ్ టేబుల్, షెడ్యూల్
ఫిబ్రవరి 19 పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ కరాచీలో మద్యాహ్నం 2 గంటలకు
ఫిబ్రవరి 20 బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా దుబాయ్‌లో మద్యాహ్నం 2 గంటలకు
ఫిబ్రవరి 21 ఆఫ్ఘనిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా కరాచీలో మద్యాహ్నం 2 గంటలకు
ఫిబ్రవరి 22 ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ లాహోర్‌లో మద్యాహ్నం 2 గంటలకు
ఫిబ్రవరి 23 పాకిస్తాన్ వర్సెస్ ఇండియా దుబాయ్‌లో మద్యాహ్నం 2 గంటలకు
ఫిబ్రవరి 24 బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ రావల్పిండిలో మద్యాహ్నం 2 గంటలకు
ఫిబ్రవరి 25 ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా రావల్పిండిలో మద్యాహ్నం 2 గంటలకు
ఫిబ్రవరి 26 ఆఫ్ఘనిస్థాన్ వర్సెస్ ఇంగ్లండ్ లాహోర్‌లో మద్యాహ్నం 2 గంటలకు
ఫిబ్రవరి 27 పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ రావల్పిండిలో మద్యాహ్నం 2 గంటలకు
ఫిబ్రవరి 28 ఆఫ్ఘనిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా లాహోర్‌లో మద్యాహ్నం 2 గంటలకు
మార్చ్ 1 దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్ కరాచీలో మద్యాహ్నం 2 గంటలకు
మార్చ్ 2 న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా దుబాయ్‌లో మద్యాహ్నం 2 గంటలకు
మార్చ్ 4 సెమీ ఫైనల్ 1 దుబాయ్‌లో మద్యాహ్నం 2 గంటలకు
మార్చ్ 5 సెమీఫైనల్ 2 లాహోర్‌లో మద్యాహ్నం 2 గంటలకు
మార్చ్ 9 ఫైనల్ లాహోర్‌లో మద్యాహ్నం 2 గంటలకు
ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతుంది. అంటే నాకౌట్ రౌండ్స్ ఉంటాయి. గ్రూప్‌లో టాప్‌లో ఉన్న జట్టు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది.
Also read: ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రత్యక్ష ప్రసారాలు ఏ దేశంలో ఎందులో చూడవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి