Cricket: ఇంగ్లండ్, భారత్ లమధ్య మధ్యాహ్నం ఆఖరి వస్డే మ్యాచ్ జరుగుతుంది. వైట్ వాష్ చేయాలని టీం ఇండియా, చివరి మ్యాచ్‌లో నైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఇంగ్లీష్ జట్టు తెగ శ్రమిస్తున్నాయి. వరుసగా రెండో వన్డేలోనూ ఘనవిజయంతో సిరీస్ సాధించిన భారత్ ఊపు మీద వుంది. ఫాం లేక బాధపడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ గత మ్యాచ్‌తో మెరుపు సెంచరీ చేశాడు అలా మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌తో విరాట్ కోహ్లి కూడా ఫామ్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇప్పటికే వన్డే 2-0 తో కైవసం చేసుకున్న టీం ఇండియా, మూడో వన్డేలో తుది జట్టులో కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ వేదికగా ఈ రోజు జరగబోయే మూడో వన్డేలో ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆడని రిషబ్ పంత్, ఫాస్ట్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ లను ఆడించనున్నట్లు తెలుస్తోంది.
ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో సూపర్ సెంచరీతో కెప్టెన్ రోహిత్ శర్మ మంచి కమ్ బ్యాక్ ఇవ్వడం భారత్ కు కలిసొచ్చే అంశం. గత కొన్ని మ్యాచులలో రోహిత్ అతి తక్కువ స్కోరుకే ఔటవుతూ వస్తున్నాడు. ఆదివారం జరిగిన మ్యాచులో 90 బంతుల్లోనే 119 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2023 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు రోహిత్ ఖాతాలో సెంచరీ లేకపోవడం పట్ల అతని అభిమానులు నిరాశకు గురయ్యారు.
దాదాపు 14 నెలల తరువాత రోహిత్ సాధించిన తొలి వన్డే సెంచరీ కావడం విశేషం. రోహిత్ సెంచరీతో కమ్ బ్యాక్ ఇచ్చిన్నప్పటికి విరాట్ కోహ్లీ మాత్రం రెండో వన్డేలో సింగిల్ డిజిట్‌కే ఔటయి నిరాశపరిచాడు. కోహ్లీ పుంజుకుని రాణిస్తేనే టీం ఇండియా జట్టుకు తిరుగుండందంటూ విశ్లేషకులు అంటున్నారు. ఫిబ్రవరి 18 నుంచి వచ్చే నెల 6 వరకు ఛాంపియన్ ట్రోపీలు వున్న సంగతి తెలిసిందే. రోహిత్, శుభ్ మన్ గిల్ ఓపెనర్లుగా మంచి ఆరంభాన్ని ఇస్తున్నారు. అదే తరహాలో కోహ్లీ సైతం రాణిస్తే ఛాంపియన్ ట్రోఫీలో ప్రత్యర్థులకు చెమటలు పట్టినట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
మరోవైపు ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ అయినా నెగ్గి కొంత ఊరట పొందాలని చూస్తోంది. సిరీస్ ఫలితంతో సంబంధం లేని ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఎదురుదాడి చేయడానికి ప్రయత్నించే అవకాశం వుంది. ఆ జట్టులో డకెట్, సాల్ట్, బట్లర్, రూట్ మంచి లయలోనే ఉన్నారు. లివింగ్‌స్టన్ మరింత దూకుడు పెంచాలని జట్టు కోరుకుంటోంది. బౌలింగ్‌లో రషీద్ ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. గత మ్యాచ్‌లో ఆడని ఆర్చర్.. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశముంది. అతను వస్తే సకిబ్ తప్పుకోవాల్సి ఉంటుంది. నరేంద్ర మోదీ స్టేడియం బ్యాటింగ్ కు పిచ్ అనుకూలం . స్పిన్నర్ల ప్రభావం కూడా బాగానే ఉంటుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సులువుగా 300 దాటగలదు. ఈ సమయంలో రాత్రి మంచు ప్రభావం దృష్ట్యా టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.