India vs England 1st ODI: ఆటగాళ్లు అంతా కలిసి పోరాడితే తిరుగులేని విజయం సాధిస్తుందని మరోసారి భారత్ నిరూపించింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా సత్తా చాటడంతో ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో 68 బంతులు మిగిలి ఉండగానే భారత్ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌ను నెగ్గిన టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది.
Also Read: Foreign Liquor: మద్యం ప్రియులకు జాక్‌పాట్.. ఒకే దుకాణం మూడు బ్రాండ్ల మద్యం
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 47.4 ఓవర్లకు 248 పరుగులు చేసి ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్ (52), జాకోబ్ బెతెల్ (51) అర్థ శతకాలతో రాణించగా.. ఫిల్ సాల్ట్ (43), బెన్ డకెట్ (32) స్కోర్‌తో రాణించారు. ఆరంభం అదిరిపోయినా మిడిలార్డర్‌లో ఇంగ్లండ్ తడబడింది. బట్లర్, బెతెల్ నిలకడగా ఆడుతున్న సమయంలో భారీ స్కోర్ సాధ్యమవుతుందని అనుకుంటుండగా భారత బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టారు. యువ బౌలర్ హర్షిత్ రాణా మూడు వికెట్లు తీసి భారీ దెబ్బతీయగా.. స్టాల్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా మూడు వికెట్లు తీశాడు. షమీ, అక్షర్, కుల్దీప్ చెరొక వికెట్ తీయడంతో ఇంగ్లండ్ 248 పరుగులకే పరిమితమైంది.
Also Read: KA Paul: 'ట్రంప్ భారతదేశ పౌరులను తరిమేస్తుంటే.. ప్రధాని మోదీ ఏం చేస్తున్నారు?
సాధారణ లక్ష్యాన్ని చేధించడానికి దిగిన భారత జట్టు 38.4 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేసి తొలి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (2) ఘోరంగా విఫలమవగా.. శుభ్‌మన్ గిల్ చెలరేగి ఆడాడు. 96 బంతుల్లో 14 ఫోర్లు బాది 87 పరుగులు గిల్ చేశాడు. బంతులు ఎక్కువ తిన్నా కూడా ఫోర్ల ద్వారా అధికంగా పరుగులు లభించాయి. యశస్వి జైస్వాల్ (15) తక్కువ స్కోర్‌కే పరిమితమవగా.. శ్రేయస్ అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) అర్ధ శతకాలతో సత్తా చాటారు. 38.4 ఓవర్లకే భారత బ్యాటర్లు మ్యాచ్‌ను ముగించారు. నాలుగు వికెట్లు మిగుల్చుకుని ఇంకా 68 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను సొంతం చేసుకోవడం విశేషం. బ్యాటర్లు చేసిన తక్కువ స్కోర్‌ను ఇంగ్లండ్ బౌలర్లు కాపాడలేకపోవడంతో మ్యాచ్ చేజారింది. సకీబ్ మహమూద్, అదిల్ రషీద్ రెండు వికెట్ల చొప్పున తీయగా.. జాకోబ్ బెతెల్, జోఫ్రా ఆర్చర్ ఒక్కో వికెట్ తీశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.