జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌తో బహుజన సమాజ్ పార్టీ నేతలు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉత్తర ప్రదేశ్ బీఎస్పీ రాజ్యసభ సభ్యులు శ్రీ వీర్ సింగ్‌తో పాటు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సమన్వయకర్త శ్రీ గౌరీ ప్రసాద్ ఉపాసక్, బీఎస్పీ తెలంగాణ విభాగం నేత శ్రీ బాలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన, బీఎస్పీ నేతల మధ్య ఆంధప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంతో పాటు విభజన హామీ చట్టంలో పేర్కొన్న అంశాలు కూడా చర్చకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో బీజేపీ, బీఎస్పీ పార్టీల మధ్య చిచ్చు రగులుతుందన్న విషయం తెలిసిందే.
అలాగే ఈ మధ్యకాలంలో అమిత్ షాకు మాయావతి లేఖ రాస్తూ.. తెలుగుదేశం పార్టీతో సహా ఎన్డీఏకు మిత్రపక్షాలన్నీ ఎందుకు దూరమవుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో జనసేన పార్టీతో బీఎస్పీ పార్టీ నేతలు చర్చలు జరపడం ఓ ఆసక్తికర పరిణామం. జాతీయ రాజకీయాల్లో పవన్ పాత్ర ఏంటన్న విషయంపై కూడా భిన్న స్వరాలు తమ గళాన్ని వినిపించే అవకాశం ఉంది.