AndhraPradesh PF Scam: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.. ఈపీఎఫ్‌ఓ ఆఫీస్‌లో పని చేసే కొందరు అధికారులు, సిబ్బంది కలిసి డేటా చోరీకి పాల్పడ్డారు. ఈపీఎఫ్‌ఓ మెంబర్స్‌కు సంబంధించిన యూఏఎన్‌లు, వారి పాస్ట్‌వర్డ్‌లను తదితర కీలక సమాచారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి లబ్ది పొందారు. ఇక ఈ విషయాన్ని సీబీఐ (CBI) గుర్తించి కేసులు నమోదు చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు (Guntur) ఈపీఎఫ్‌ఓ రీజినల్ ఆఫీస్‌లో విజిలెన్స్, సీబీఐ అధికారులు తాజాగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఇక్కడ పని చేసే కొందరు అధికారులు, సిబ్బందికి సంబంధించిన మొబైల్స్‌ను వారు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
దీంతో వారు ఈపీఎఫ్‌ఓ మెంబర్స్‌కు (EPFO Members) సంబంధించిన డేటాను ఇతరులకు షేర్ చేస్తున్నారని తేలింది. అలాంటి వారిపై నాలుగు వేర్వేరు కేసుల్ని నమోదు చేశారు. ఈ కేసుల్లో మొత్తం నలభై ఒక్క మందిని నిందితులుగా చేర్చారు.
ఈపీఎఫ్‌ఓ సిబ్బందితో పాటు కొన్ని ప్రైవేట్ కన్సల్టెన్సీలు, అలాగే కొందరు ప్రైవేట్ వ్యక్తుల్ని కూడా ఈ కేసుల్లో నిందితులుగా చేర్చారు. కేసుల విచారణలో భాగంగా గుంటూరుతో పాటు పలు ప్రాంతాల్లోని ఈపీఎఫ్‌ఓ (EPFO) సిబ్బంది నివాసాల్లో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. వారి నుంచి పలు డ్యాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇక ఈపీఎఫ్‌ఓ అధికారులు, సిబ్బంది కలిసి పీఎఫ్ మెంబర్స్‌కు సంబంధించిన డేటాను ప్రైవేట్ కన్సల్టెన్సీలకు ఇచ్చినందుకుగాను వారు ఆయా ప్రైవేట్ కన్సల్టెన్సీల నుంచి డబ్బు పొందారు. ఫోన్‌పే, పేటీఎం (Paytm) తదితర యాప్స్ ద్వారా ఈ లావాదేవీలు జరిగాయి. 2019 నుంచే ఇలాంటి ట్రాన్జాక్షన్స్ జరిగినట్లు సీబీఐ (CBI) అధికారులు గుర్తించారు.
Also Read: Chalo Vijayawada: విజయవాడలో హైటెన్షన్.. అటు పోలీసుల అరెస్టులు, ఇటు ఉద్యోగుల దూకుడు.
Also Read: Gold Price Today : స్థిరంగా పసిడి.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలివే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook