Pawan Vs Cobbler: ఒక్కసారైనా చట్టసభలో అడుగుపెట్టాలని భావిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఈసారి అదృష్టం లభిస్తుందో లేదోననే ఉత్కంఠ నెలకొంది. కూటమి అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్న పిఠాపురంలో మాత్రం భారీగా నామినేషన్లు రావడం ఆయన విజయానికి కొంత బ్రేక్‌లు వేసే అవకాశం ఉంది. ఆయనపై పోటీ చేస్తున్న వారిలో ఒక చెప్పులు కుట్టే వ్యక్తి ఉండడం ఆసక్తికరం.
Also Read: Pawan Kalyan Assets: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆస్తులు ఇంత తక్కువా? ఆయన ఆస్తుల వివరాలు ఇవే..
కాకినాడ జిల్లా పిఠాపురంలోని సీతయ్యగారితోటలో ఏడిద భాస్కర్ రావు నివసిస్తుంటాడు. ఆయన ఎంఏ రాజనీతి శాస్త్రం చదివాడు. కానీ వృత్తిరీత్యా మాత్రం చెప్పులు కుడుతుంటాడు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద చెప్పులు కుడుతూ జీవనం సాగిస్తుంటాడు. అదే వృత్తితో కుటుంబాన్ని పోషిస్తుండడం గమనార్హం. ఆ వృత్తి కొనసాగిస్తూనే ఎంఏ పూర్తి చేశాడు. తాజాగా ఆయన పోటీ చేయడానికి పది మంది సహకరించారు. ఆయన అభ్యర్థిత్వానికి కొందరు మద్దతు ప్రకటించి సంతకాలు చేశారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఏడిద భాస్కర్ రావు పోటీ చేస్తున్నారు. పోటీ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేస్తానని భాస్కర్ రావు ప్రకటించారు.
Also Read: YS Sharmila: వైఎస్ జగన్, చంద్రబాబు, మోదీ ముగ్గురినీ ఏకిపారేసిన షర్మిల
భారీగా నామినేషన్లు
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇక్కడి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ టీడీపీ జనసేన తరఫున పవన్ కల్యాణ్ ప్రధానంగా పోటీ చేస్తున్నారు. నామినేషన్ల గడవు ముగియగా ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు 23 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వంగా గీత బరిలో నిల్చున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్‌ను ఈసారి కూడా ఓడించాలనే పట్టుదలతో వైఎస్సార్‌సీపీ తీవ్రంగా కృషి చేస్తోంది. గత ఎన్నికల్లో రెండు చోట్ల పవన్ కల్యాణ్‌ను ఓడించగా ఈసారి పిఠాపురంలో కూడా అలాంటి పరాభవమే పవన్‌కు ఎదురవుతుందని వైసీపీ దళం పూర్తి ధీమాతో ఉంది.
పవన్ కల్యాణ్‌ను ఈసారి ఎలాగైనా చట్టసభలోకి అడుగుపెట్టే బాధ్యతను బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేనలు తీసుకున్నాయి. ఈ క్రమంలోనే పవన్ సొంత సామాజికవర్గం అధికంగా ఉండే పిఠాపురంలో పోటీకి దింపారు. కుల ఓట్లు నమ్ముకున్న పవన్ కల్యాణ్‌కు ఈసారి కలిసి వస్తుందో లేదో చూడాలి. గెలుపు కోసం పవన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. కూటమి తరఫున రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉండగా వాటిని కాదని పిఠాపురం నియోజకవర్గానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పవన్‌కు మద్దతుగా సినీ రంగం వారు కూడా రంగంలోకి దిగారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter