ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలో తెలుగు దేశం పార్టీ ఎంపీలు నిత్యం నిరసన వ్యక్తంచేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల్లో భాగంగా గత వారం ఓ స్కూలు పిల్లాడి వేషంలో పార్లమెంట్‌కి వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా రాకపోతే భవిష్యత్ తరాలు ఎంత నష్టపోతాయోననేది చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తూ ఆన ఆవేదనను వ్యక్తపరిచారు. ఆ తర్వాత సోమవారం చీరకట్టులో పార్లమెంట్‌కి వచ్చి నిరసన తెలిపిన టీడీపీ ఎంపీ శివప్రసాద్.. నిన్న గురువారం నాడు స్వచ్ఛభారత్ కార్మికుడి వేషం ధరించారు. ఇలా రోజుకో వేషంలో పార్లమెంట్ వద్ద కనిపిస్తున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నిత్యం ఏదో ఓ విధంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలావుంటే టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఇవాళ పశువుల కాపరి వస్త్రధారణలో పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. లుంగీ, బనియన్ ధరించి, చేతిలో పశువులు కాసే కర్ర పట్టుకుని పార్లమెంట్‌కి వచ్చిన ఎంపీ శివప్రసాద్ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు.