Chandrababu on CM Jagan: కూల్చివేతలు తప్ప నిర్మించడం జగన్‌కు సాధ్యం కాదు..చంద్రబాబు ధ్వజం..!

Chandrababu on CM Jagan: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ విమర్శల దాడిని పెంచింది. మూడేళ్ల పాలనలో చేసిందేమి లేదంటూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది.

Written by - Alla Swamy | Last Updated : Jun 25, 2022, 04:08 PM IST
  • వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ విమర్శల దాడి
  • ప్రజా వేదిక కూల్చివేతకు నేటికి మూడేళ్లు
  • ఈసందర్భంగా చంద్రబాబు ట్వీట్
Chandrababu on CM Jagan: కూల్చివేతలు తప్ప నిర్మించడం జగన్‌కు సాధ్యం కాదు..చంద్రబాబు ధ్వజం..!

Chandrababu on CM Jagan: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ విమర్శల దాడిని పెంచింది. మూడేళ్ల పాలనలో చేసిందేమి లేదంటూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది. ఈక్రమంలో ట్విట్టర్‌ వేదికగా వైసీపీ మూడేళ్ల పాలనపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇది కూల్చివేతల ప్రభుత్వం..ప్రజా వేదిక విధ్వంసానికి మూడేళ్లు అంటూ ట్వీట్ చేశారు. తన సైకో పాలన ఎలా ఉండబోతోందో ప్రజలకు చెప్పడానికి అధికారంలోకి రాగానే జగన్‌రెడ్డి తొలి పనిగా ప్రజా వేదికను కూల్చి వేశారన్నారు.

కోట్ల విలువైన ప్రజల ఆస్తిని ధ్వంసం చేస్తూ..తన ఆలోచనలు ఎలా ఉంటాయో రాష్ట్రానికి సీఎం వివరించి నేటికి మూడేళ్లు అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. డిస్ట్రక్షన్‌ తప్ప కన్‌స్ట్రక్షన్ చేతగాని జగన్‌ చేసినవన్నీ కూల్చివేతలేనని విమర్శించారు. మూడేళ్లలో రాష్ట్ర ఆర్థిక స్థాయిని కూల్చారని..ప్రజాస్వామ్య వ్యవస్థలను కూల్చారని..యువత భవితను కూల్చారని మండిపడ్డారు. ప్రజా రాజధాని అమరావతిని, పోలవరం కలను కూల్చి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజా వేదిక కూల్చి వికృతానందం పొందిన సీఎం జగన్..మూడేళ్లల్లో కట్టింది మాత్రం శూన్యమన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వం కట్టిన నిర్మాణాల్లోనే పాలన చేస్తూ..తన వల్ల ఏమీ కాదని..తనకు ఏమీ రాదని తేల్చి చెప్పేశారన్నారు. కూల్చడం కంటే నిర్మించడం ఎంత కష్టమైన పనో మూడేళ్ల పాలన తర్వాత అయిన జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు.

 

Also read: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో బలంగా వీస్తున్న నైరుతి గాలులు..లెటెస్ట్ వెదర్‌ రిపోర్ట్‌ మీ కోసం..!

Also read:Droupadi Murmu: విపక్ష కూటమికి బిగ్ షాక్.. ద్రౌపదీ ముర్ముకు మాయావతి సపోర్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News