Ari Movie Trailer అనసూయ ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కథలు నచ్చితే, తన పాత్ర కొత్తగా ఉంటే అనసూయ వెంటనే ఓకే చెప్పేస్తోంది. అలా ఆమె ఓకే చెప్పిన ఓ సినిమానే అరి. పేపర్ బాయ్ డైరెక్టర్‌గా జయశంకర్‌కు ఏర్పడిన ఇమేజ్ అందరికీ తెలిసిందే. సెన్సిబుల్ డైరెక్టర్‌గా జయశంకర్‌కు మంచి పేరు వచ్చింది. అయితే పేపర్ బాయ్ తరువాత జయశంకర్ అరి అంటూ కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు.
అరి అంటూ టైటిల్‌ను ప్రకటించినప్పటి నుంచి సినిమా మీద అంచనాలు పెంచుకుంటూనే వచ్చారు. ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్ ఇలా ప్రతీ ఒక్క విషయంలో అరి అందరినీ మెప్పిస్తూనే వస్తోంది. ఇప్పుడు ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్లో అనసూయ, శుభలేఖ సుధాకర్, సాయి కుమార్ పాత్రలు హైలెట్ అవుతున్నాయి.
అరి ట్రైలర్లో అనసూయ కనిపించిన తీరు, ఆమె పాత్ర తీరు తెన్నులు, చెప్పిన డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తనకంటే అందంగా కావాలంటూ అనసూయ పాత్ర చెప్పిన డైలాగ్‌ను పట్టి చూస్తే.. ఏదో ఇంట్రెస్టింగ్ కథ ఉందనిపిస్తోంది. ఇక అందంగా మారాలంటే యాసిడ్ పోయాల్సిందే అన్నట్టుగా చూపించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook