Deepika - Ranveer: అభిమానులకు రణ్‌వీర్, దీపికా దంపతులు ఆ గుడ్ న్యూస్ చెప్పనున్నారా.. ?

Deepika Padukone - Ranveer Singh: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే గర్భంతో ఉందా.. ? త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతుందా ..?  త్వరలో వీళ్లిద్దరు అభిమానులకు ఆ వార్తను అఫీషియల్‌గా ప్రకటించబోతున్నారా ? అంటే ఔననే వార్తలు వస్తున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 20, 2024, 05:38 PM IST
Deepika - Ranveer: అభిమానులకు రణ్‌వీర్, దీపికా దంపతులు ఆ గుడ్ న్యూస్ చెప్పనున్నారా.. ?

Deepika Padukone - Ranveer Singh: బాలీవుడ్ ప్రేమ జంటల్లో దీపికా పదుకొణే, రణ్‌వీర్ సింగ్ ఒకరు. ఎన్నో ఏళ్లు ప్రేమించుకున్న తర్వాత వీళ్లిద్దరు 2018లో విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇక వీళ్లిద్దరు తొలిసారి 'రామ్ లీలా..గోలియోంకా రాస్‌లీలా' సినిమాలో నటించారు. ఈ సినిమాలో వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత 'బాజీరావు మస్తానీ' సినిమాతో అది పీక్స్‌కు చేరింది. ఆ సినిమా తర్వాత వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట ఒకటి రెండు సినిమాల్లో కనిపించింది. కానీ పెద్దగా అట్రాక్ట్ చేయలేకపోయారు.

ఇక రణ్‌వీర్ సింగ్, దీపికాల మ్యారేజ్ అయి ఐదేళ్లు అవుతున్న ఇప్పటికీ ఈ జంటకు పిల్లలు లేరు. అప్పట్లో వీళ్లిద్దరు ఎవరి కెరీర్ వాళ్లు కంటిన్యూ చేయాలనే ఒప్పందంతోనే వీళ్లు పెళ్లి చేసుకున్నట్టు బాలీవుడ్ మీడియా చెప్పింది. ఇక మ్యారేజ్ తర్వాత దీపికా 'పఠాన్', రీసెంట్‌గా 'ఫైటర్' సినిమాల్లో రెచ్చిపోయి నటించింది. అటు రణ్‌వీర్ సింగ్ వరుస సినిమాలతో దుమ్ము రేపుతున్నాడు.

అటు బాలీవుడ్‌లోనే కాకుండా హాలీవుడ్ సినిమాల్లో కూడా సత్తా చాటిన ఈమె.. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'కల్కి 2898' మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ ప్యాన్ వరల్డ్ రేంజ్‌లో విడుదల కాబోతుంది. తాజాగా ఈమె గర్భవతి అనే వార్త ప్రముఖ న్యూస్ పోర్టల్‌లో వైరల్ అవుతోంది. తాజాగా హాలీవుడ్ షోలో ఈమె పాల్గొన్నపుడు ఈమె బేబి బంప్‌తో ఉన్నట్టు కొన్ని వెబ్ సెట్స్ కథనాలు వండి వార్చాయి. ప్రస్తుతం దీపికా చేస్తోన్న కల్కి దాదాపు పూర్తి కావొచ్చింది. ఆ సంగతి పక్కన పెడితే.. దీపికా ప్రెగ్నెన్సీ పై ఆమె పర్సనల్ టీమ్ కానీ.. ఆమె భర్త రణ్‌వీర్ సింగ్ మాత్రం ఖండించడం లేదు. మరి త్వరలోనే ఈ జంట అభిమానులకు నిజంగా ఆ శుభవార్త చెబుతారా లేదా అనేది వెయిట్ సీ.  

Also Readహరీష్ రావును చూస్తుంటే.. మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారు.. బీఆర్ఎస్ ను ఏకీపారేసిన సీఎం రేవంత్ రెడ్డి..

Also ReadDengue Fever: మంత్రికి సోకిన డెంగీ వ్యాధి.. మేడారం జాతర ఎలా జరుగునోనని ఆందోళన..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News