DSP in Hyderabad: దేవిశ్రీప్రసాద్ గురించి.. సౌత్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రతి ఒక్కరి ఫేవరెట్ ప్లే లిస్టులో.. తప్పకుండా దేవిశ్రీ ప్రశాంత్ పాటలు ఎక్కువగానే ఉంటాయి. దేవి, మన్మధుడు, సొంతం, ఆర్య లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్స్ ఇచ్చారు దేవి. ఈ క్రమంలో దేవిశ్రీప్రసాద్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సంవత్సరాలు కావస్తున్న.. ఇప్పటివరకు ఆయన హైదరాబాద్లో ఎప్పుడు లైవ్ షోలు జరపలేదు. అయితే తాజాగా ఇప్పుడు హైదరాబాద్ లో లైవ్ షో లో పాల్గొనబోతున్నారు ఈ రాక్ స్టార్.
హైదరాబాద్ మహానగరంలో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లైవ్ షో పర్ఫార్మెన్స్ ఉంటుందని.. ఈరోజు ఆయనే స్వయంగా ఆయనే ప్రకటించారు. జూలై 14 న రాక్‌స్టార్ డీఎస్‌పీ తన సోషల్ మీడియా ఖాతాలో #DSPLiveIndiaTour లో భాగంగా హైదరాబాద్‌లో ప్రదర్శన ఇవ్వడానికి.. తాను సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఆయన మ్యూజిక్ ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచే ఈ వేడుక ప్రారంభం కానున్నట్లు తెలిపారు. 25 సంవత్సరాల్లో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ మ్యూజిక్ డైరెక్టర్.. ఇప్పటివరకు ఎప్పుడు లైవ్ షోలు ఇవ్వలేదు. అలాంటిది మొదటి సారి హైదరాబాద్‌లో డీఎస్‌పీ లైవ్ షో ఉంటుంది అని తెలియడంతో ..ఆయన అభిమానులు తెగ ఆనందపడుతున్నారు.
తెలుగులో ఎంతో పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు దేవిశ్రీప్రసా. తమిళ్, హిందీ ఇతర భాషాల్లో సైతం సంగీతం అందించి అందరినికి ఉర్రుతలూగించారు. ఇప్పుడు లైవ్ షో ద్వారా తన అభిమానులకు మరింత చెరువు కానున్నారు.
ఇక హైదరాబాద్‌లో ఆయన మొదటి ప్రదర్శనతో ఈ #DSPLiveIndiaTour ప్రారంభించనున్నారు.
కాగా#DSPLiveIndiaTour ప్రొగ్రామ్‌ను, ACTC అనే ఈవెంట్ సంస్థ నిర్వహిస్తోంది. ఇది కేవలం సంగీత కచేరీ మాత్రమే కాదు.. డ్యాన్సులతో అలరించే ఓ అద్భుతమైన సందడి కలిగించే ఈవెంట్ అని తెలుస్తోంది. కాగా ఈ హైదరాబాద్ కాన్సెర్ట్ కోసం టిక్కెట్లు పొందాలంటే www.actcevents.com అనే వైబ్ సైట్ ద్వారా అలాగే Paytm ఇన్‌సైడర్‌లో టిక్కెట్‌లు కొనుగోలు చేయవచ్చు. జూలై 14, 2024 నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి.
Also Read: Shankar: పాత చింతకాయ పచ్చడిలా మారిన శంకర్ పరిస్థితి.. ఇక గేమ్ చేంజర్ గతి అంతేనా!
Also Read: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి