Pallavi Prasanth Political Entry:
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆధ్యంతం అలరించిన రియాలిటీ షో బిగ్ బాస్. లాస్ట్ సీజన్లో కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు. అయితే ఆ తర్వాత బయటకు వచ్చాక అతను సృష్టించిన కాంట్రవర్సీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆంధ్రాలో ఎన్నికల హడావిడి నెలకొన్న ఈ తరుణంలో మీ ఆశీర్వాదంతో ఎంపీని అవుతాను అంటూ హడావిడి చేస్తున్నాడు.
ఫుల్లు వైట్ అండ్ వైట్ దుస్తులు వేసుకుని.. కాళ్లకు కిర్రు చెప్పులు.. కళ్ళకి నల్ల కళ్ళజోడు తగిలించి..పెద్ద పొలిటికల్ లీడర్ లా ఫోజులు ఇచ్చేస్తున్నాడు.అన్నా మళ్లొచ్చినా అంటూ కామెడీ వీడియోలు పెట్టే పల్లవి ప్రశాంత్.. ఎంపీ అవ్వాలి అన్న విషయం లో మాత్రం చాలా సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఊహతీతంగా
ఉన్న పల్లవి ప్రశాంత్ చర్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అప్పుడేమో రైతు బిడ్డని ..జై జవాన్ జై కిసాన్.. అంటూ సింపథీ తో బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు.
నేను విన్నర్ అయితే డబ్బు మొత్తం రైతులకే పంచుతాను అని మాట ఇచ్చి.. అచ్చమైన రాజకీయ నాయకుడిలా ఆ తర్వాత ఆ మాటనే మర్చిపోయినట్లు తిరుగుతున్నాడు పల్లవి ప్రశాంత్. ఈ నేపథ్యంలో అతనిపై నెటిజన్స్ పలు రకాల విమర్శలు కూడా కురిపిస్తున్నారు. రైతును.. రైతుబిడ్డను అన్నావ్.. గెలిచిన ప్రతి రూపాయి రైతులకే ఖర్చు పెడతాను అన్నావు.. ఏది ఎక్కడకు మాయమైపోయావు అంటూ అతనిపై పలు రకాల మీమ్స్ కూడా క్రియేట్ చేశారు.
బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత హౌస్ నుండి బయటకు వస్తూ అతను చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దీంతో ఏకంగా మనోడు కటకటాలు కూడా లెక్కపెట్టి వచ్చాడు. ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న పల్లవి మళ్లీ తన వింత చేష్టలతో రెచ్చిపోతున్నాడు. పొలిటికల్ పిచ్చి పీక్స్ లోకి ఎక్కించుకున్న పల్లవి ఫుల్ వైట్ అండ్ వైట్ డ్రెస్సులతో దండాలు పెడుతూ తిరగడమే కాకుండా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేంజ్ లో ఫీల్ అయిపోతున్నాడు. అతని విజయానికి కారణమైన పొలిటికల్ సాంగ్స్ తన రీల్స్ కి వాడుకొని పిచ్చ హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదేదో సరదా కోసమో లేకపోతే వ్యూస్ పెంచుకోవడం కోసం చేస్తున్న పని కాదు.. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ఫిక్స్ అవ్వడంతో అతను ఇలా బిహేవ్ చేస్తున్నాడు అన్న టాక్ బలంగా నడుస్తుంది. ఈ నేపథ్యంలో పల్లవికి ఛాన్స్ ఇచ్చే ఆ పార్టీ ఏంటో అన్న డిస్కషన్ కూడా జోరుగా సాగుతోంది.
Also Read: మెగా కాంపౌండ్ హీరోల కష్టాలు.. ఇక రంగంలోకి మెగాస్టార్ దిగాల్సిందేనా!
Also Read: బావ ఈజ్ బ్యాక్.. మిస్టర్ ఈగో చిందులు.. బెడ్‌రూం కంటే జైలు బెట్టర్ అంటున్న కల్యాణ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter