Game Changer: 2025 సంక్రాంతి రేసులో ముందుగా విడుదలైన చిత్రం ‘గేమ్ చేంజర్’. పొంగల్ కానుకగా రిలీజైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి రోజు ఈ సినిమా రూ. 186 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా విడుదల సందర్భంగా మొదటి రోజు ‘నా నా హైరానా’ పాట లేకపోవడంతో అభిమానులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసారు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణాల వల్లే ‘నా నా హైరానా’ పాటను యాడ్ చేయలేకపోయారు.
అయితే ‘గేమ్ చేంజర్’ మూవీలో ఈ పాటను నేటి నుంచి ప్రదర్శించనున్నారు. ఇన్ ఫ్రా రెడ్ కెమెరాతో చిత్రీకరించిన ఈ పాటను ప్రేక్షకులకు ఐ ఫీస్ట్‌లా ఉండనుంది. ఈ సినిమా రెండో రోజు డీసెంట్ వసూళ్లను రాబట్టింది. హిందీలో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. తొలి రోజు అక్కడ రూ 8.64 కోట్ల నెట్ వసూళ్లను సాధిస్తే.. రెండో రోజు రూ. 8.43 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
‘గేమ్ చేంజర్’ విషయానికొస్తే.. ఈ సినిమాలో రామ చరణ్ రామ్ నందన్ అనే ఐపీఎస్ తో పాటు ఐఏఎస్ పాత్రలో నటించాడు. మరోవైపు అప్పన్న పాత్రల్లో ఒదిగిపోయాడు. ఓ వైపు స్టైలిష్‌గా, మరో వైపు నటనతో ఆకట్టుకున్నాడు. రామ్ చరణ్ గ్రేస్ ఫుల్ స్టెప్పులు, చరణ్-ఎస్.జె.సూర్య మధ్య ఉండే పోటా పోటీ సన్నివేశాలకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. రామ్ చరణ్-కియారా కెమిస్ట్రీ, అంజలి అద్భుతమైన యాక్టింగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. లార్జర్ దేన్ లైఫ్ సినిమాలను తెరకెక్కించటంలో స్పెషలిస్ట్ అయిన శంకర్ తనదైన పంథాలో గేమ్ చేంజర్ సినిమాను తెరకెక్కించాడు. అక్కడక్కడ తడబడ్డ ఓవరాల్ గా రామ్ చరణ్ అభిమానులు కోరుకునే సినిమానే ఇచ్చాడు
గేమ్ చేంజర్ చిత్రానికి సంగీతం మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అందించారు. తిరు ఎక్స్‌ట్రార్డినరీ విజువలైజేషన్ సినిమాను నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లాయి. ఈ సినిమాను శ్రీమతి దివంగత అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు.
ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.