యువతి ఏకంగా తన పెళ్లి రోజు బస్సు నడిపి అందరినోట ఔరా అనిపించింది. ఆమె ఈ విధంగా నడపడానికి బలమైన కారణముందంటోంది. ఇంతకీ ఆ పెళ్లి కూతురు బస్సు ఎందుకు నడిపిందో తెలుసుకుందామా ..?
వివరాల్లోకి వెళ్లినట్లయితే చైనాలో వినూత్న ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి తన పెళ్లి రోజు అందరినీ ఆశ్చర్య పరిచేలా బస్సు డ్రైవర్ అవతారం ఎత్తింది. బస్సు నడుపుతూ మధ్యలో పెళ్లి కొడుకు ఇంటి వైపునకు వెళ్లి అతన్ని ఎక్కించుకుని వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను ఓ చైనాకు చెందిన పీపుల్స్ డైలీ మీడియా తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎందుకు నడిపిందంటే..?
వాస్తవానికి ఆ యువతికి కాలుష్య రహిత సొంతంగా ఓ బస్సు ఉందట..కాగా ఆమే దానికి డ్రైవర్. తన పెళ్లి సందర్భంగా బస్సు అంతా బెలూన్లు, పూలతో అలంకరించింది. ఈ సందర్భంగా పెళ్లి కూతురు మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించాలని కోరుకుంటున్నా.. అందుకే వినూత్న రీతిలో తను పెళ్లి రోజు బస్సు నడిపి అందరి దృష్టిని ఆకర్షించ వచ్చని భావించానని పేర్కొంది. తద్వారా కాలుష్య నివారణ ప్రచారానికి తన ప్రయత్నం పనికి వస్తుందని చెప్పింది ఆ పెళ్లికూతురు.
From pop culture themes to nostalgia-filled affairs, here is another offbeat wedding idea. A bride who works as a bus driver sends herself to the wedding hall in her own bus! pic.twitter.com/Mwy6yMMZPB
— People's Daily,China (@PDChina) May 29, 2018