Black Coffee Benefits: బ్లాక్ కాఫీతో ప్రాణాంతక కేన్సర్‌కు సైతం చెక్, ఇవీ ప్రయోజనాలు

Black Coffee Benefits: టీ కంటే బ్లాక్ టీ ఎలా మంచిదో..కాఫీల్లో బ్లాక్ కాఫీ అద్బుతమైంది. ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో బ్లాక్ కాఫీ పాత్ర కీలకం. బ్లాక్ కాఫీతో కలిగే ఆరోగ్య ప్రయజనాలు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 23, 2022, 12:07 AM IST
Black Coffee Benefits: బ్లాక్ కాఫీతో ప్రాణాంతక కేన్సర్‌కు సైతం చెక్, ఇవీ ప్రయోజనాలు

ఆరోగ్యమే మహా భాగ్యమనేది అందరికీ తెలిసిన విషయమే. చాలా సందర్భాల్లో సులభమైన చిట్కాలతోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. అలాంటివాటిలో ఒకటి బ్లాక్ కాఫీ.ఆ వివరాలు మీ కోసం..

బ్లాక్ కాఫీ ప్రయోజనాలు

బ్లాక్‌కాఫీతో ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. బ్లాక్‌కాఫీతో గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యల్ని తగ్గించుకోవచ్చు

బ్లాక్‌కాఫీలో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని విష వ్యర్థాల నుంచి కాపాడే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. కాఫీలో ఉండే శక్తివంతమైన కెమికల్ కాంపౌండ్లు వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా ప్రాణాలు తీసే కేన్సర్ వ్యాధి రాకుండా కాఫీ అడ్డుకోగలదని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచంలో జరిపిన పలు అధ్యయనాల ప్రకారం..కాఫీ గింజలతో తయారుచేసిన ఓ కప్పు బ్లాక్‌కాఫీలో 2 కేలరీలు ఉంటాయి. అంటే కాఫీలో కేలరీలు తక్కువే. అయితే.. కాఫీకి అదనంగా ఏవిధమైన పదార్ధాలు లేదా ఫ్లేవర్స్ జత చేయకుండా ప్లెయిన్ బ్లాక్ కాఫీ మాత్రమే సేవించాలి. 

బ్లాక్‌‌కాఫీలో ఉండే క్లోరోజెనిక్‌ యాసిడ్‌ అనే పదార్థం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బాడీలో నీరు ఎక్కువైతే కూడా బరువు పెరుగుతారు. ముఖ్యంగా పొట్ట పెరుగుతుంది. బ్లాక్‌కాఫీ బాడీలో అవసరం లేని నీటిని బయటకు పంపేస్తుంది. తరచూ యూరిన్‌కి వెళ్లడం వల్ల బాడీలో అదనపు బరువు తగ్గుతుంది. 

బ్లాక్‌‌కాఫీలో క్లోరోజెనిక్‌ యాసిడ్‌ ఉండటం వల్ల రాత్రి భోజనం తర్వాత శరీరంలో గ్లూకోజ్‌ ఉత్పత్తి ఆలస్యం అవుతుంది. బ్లాక్‌కాఫీలో ఉండే కెఫిన్‌ మన శరీరంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కెఫిన్‌ అనే పదార్థం మెదడును, కేంద్ర నాడీ వ్యవస్థను చురుకుగా పని చేసేందుకు సహాయపడుతుంది. మనిషి శక్తి సామర్ధ్యం మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. 

బ్లాక్ కాఫీతో మెటబోలిజం వేగవంతం

గ్రీన్‌ కాఫీ గింజలు మన శరీరంలో కొవ్వును కరిగించే సామర్థ్యాన్ని పెంచేందుకు సహాయపడుతుంది. ఇది కాలేయానికి సహాజమైన క్లెన్సర్‌గా కూడా పని చేస్తుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌, మితిమీరిన లిపిడ్‌లను తొలగించి జీవక్రియను వేగవంతం చేస్తుంది.

Also read: Cholesterol Tips: ఈ ఆహార పదార్ధాలు తీసుకుంటే కేవలం 21 రోజుల్లో కొలెస్ట్రాల్‌కు చెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News