Best Food Habits: నిత్య జీవితంలో వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగానే అనారోగ్యం కొనితెచ్చుకుంటున్నాం. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు. కూరగాయలు అలవాటు చేసుకుంటే మీ గుండెను పదికాలాలు పదిలంగా ఉంచుకోవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.
కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రత్యేకించి ఆకు కూరగాయల్లో లేదా పచ్చని కూరగాయల్లో పోషక పదార్ధాలు మెండుగా ఉంటాయి. మీకు లాభాన్ని చేకూరుస్తున్నాయి. అంతేకాదు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతూ..బరువును తగ్గిస్తూ..రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చాలా సందర్భాల్లో ఆహారపు అలవాట్ల కారణంగానే అనారోగ్యం పాలవుతుంటాం. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో గుండెకు ప్రమాదం ఏర్పడుతుంది.
కాలిఫ్లవర్‌లా కన్పించే బ్రోక్లీ..గుండెకు చాలా మంచిది. ఇందులో ప్రోటీన్లు, కాల్షియం, కెరోటిన్, కార్బొహైడ్రేట్స్, ఐరన్, విటమిన్ ఎ వంటి న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి తక్షణం మేలు చేకూరుస్తాయి. బ్రోక్లీని సూప్, కూర లేదా సలాడ్ కింద తినవచ్చు. పాలకూర అనేది పోషక పదార్ధాలతో నిండి ఉంటుంది. ఇందులో ఐరన్, ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఫోలెట్ వంటి పోషకాలుంటాయి. ఇది మీకు చాలా రోగాల్నించి కాపాడుతుంది. క్యారెట్ విటమిన్ సీ తో పాటు ఐరన్, సోడియం, పొటాషియం, కార్బొహైడ్రేట్, ప్రోటీన్, విటమిన్ ఎ , బీ6 లకు మూలాధారం. క్యారెట్‌ను రోజువారీ ఆహారంలో చేర్చితే..మీ గుండెను ముప్పు నుంచి తప్పించుతుంది.
ఇక వెల్లుల్లి చేసే మేలు మాటల్లో చెప్పలేం. వెల్లుల్లి తీసుకుంటే చాలా రకాల సంక్రమణల్నించి తప్పించుకోవచ్చు. ఇందులో ఉన్న ఎలిసిన్ కొలెస్ట్రార్ స్థాయిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. రక్తం క్లాట్ కాకుండా కాపాడుతుంది. బెండకాయలో పైబర్, బీటా కెరోటిన్, విటమిన్ ఎ, పొటాషియం, కాల్షియం, కార్బొహైడ్రేట్‌లు మెండుగా ఉంటాయి. బెండకాయ తినడం వల్ల గుండెకు సంబందించిన రోగాలు రాకుండా ఉంటాయి.
Also read: Anti Ageing Facepack: వయస్సు 40 ఏళ్లు దాటినా..యవ్వనంగా ఉంచే ఫేస్‌ప్యాక్ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook