Bharat Jodo Yatra: 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళుతోంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ లో ఉదయ్ పూర్ లో నిర్వహించిన చింతన్ శివిర్ లో వచ్చే ఎన్నికల కార్యాచరణపై చర్చించారు కాంగ్రెస్ నేతలు. దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్రకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలు కానుంది. భారత్ జోడో యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. రాహుల్ పాదయాత్రను సక్సెస్ చేసేందుకు ప్రత్యేక కమిటీలను నియమించింది. పొలిటికల్ అఫైర్స్ కమిటి, టాస్క్ ఫోర్స్ 2024 గ్రూప్ తో పాటు భారత్ జోడో యాత్ర ప్లానింగ్ మరియు కో ఆర్డీనేషన్ కోసం ప్రత్యేక కమిటీలను ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ ప్రకటించారు.
ఏఐసీసీ ప్రకటించిన పొలిటికల్ అఫైర్స్ కమిటిలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్, అంబికా సోని, దిగ్విజయ్ సింగ్, అనంద్ శర్మ, కేసీ వేణుగోపాల్, జితేందర్ సింగ్ ఉన్నారు. టాస్క్ ఫోర్స్ 2024 గ్రూప్ లో పి చిదంబరం, ముకుల్ వాస్నిక్, జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, ప్రియాంక గాంధీ వాద్రా,రణదీప్ సింగ్ సూర్జేవాలా, కే సునీల్ ను నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. భారత్ జోడో యాత్ర సెంట్రల్ ప్లానింగ్ మరియు కో ఆర్డీనేషన్ గ్రూప్ లో దిగ్విజయ్ సింగ్, సచిన్ పైలెట్, శశి థరూర్, రణవీత్ సింగ్ భట్టు, కేజే జార్జ్, జోతి మని,ప్రద్యుత్ బోర్డోలూయి, జితూ పత్వారి, సలీమ్ అహ్మద్ ను అపాయింట్ చేసింది.
Following the Udaipur Nav Sankalp Shivir, the Hon'ble Congress President has constituted a Political Affairs Group that will be presided over by her, a Task-Force-2024 and a Central Planning Group for the coordination of the "Bharat Jodo Yatra", as follows with immediate effect. pic.twitter.com/BowKRBZ7zY
— INC Sandesh (@INCSandesh) May 24, 2022
చింతన్ శివిర్ లో పార్టీ బలోపేతంపైనా సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రంలో అధికారం చేపట్టాలంటే రాష్ట్రాల్లో తిరిగి తమ ఉనికి చాటుకోవాలని నిర్ణయించారు. పార్టీ నేతలకు సోనియాగాంధీ దిశానిర్దేశం చేశారు.నేతలు క్యాపిటల్ లో కాకుండా గ్రామాలకు వెళ్లాలని సూచించారు. ప్రజా క్షేత్రంలో ఉన్నవాళ్లకే టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అంతేకాదు ఎన్నికల్లో పోటీకి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఒక కుటుంబానికి ఒకటే టికెట్ ఇవ్వబోతున్నారు. పార్టీ పదవులతో పాటు ఎన్నికల్లో టికెట్లలో 50 ఏళ్ల లోపు నాయకులకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు.
ప్రజలకు దగ్గర కావాలని, నాయకులు జనాల్లోకి వెళ్లాలని తీర్మానించింది కాంగ్రెస్ పార్టీ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర మొదలు పెట్టాలని నిర్ణయించింది. అక్టోబర్-2న ఈ యాత్రకు మూహూర్తం ఖరారు చేసింది. ఉదయ్ పూర్ వేదికగా జరిగిన చింతన్ శిబిర్ లో భారత్ జోడో యాత్ర సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. ఇటీవల తెలంగాణ పర్యటనలో కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులకు ఇలాంటి సూచనలే ఇచ్చారు. “ఢిల్లీ రావొద్దు, హైదరాబాద్ లో కూర్చోవద్దు.. నియోజకవర్గాల్లో తిరగండి, జనంలో కలవండి” అంటూ ఆయన నాయకులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం పార్టీ పదవులు ఇవ్వబోతున్నారు, ఉదయపూర్ నవ సంకల్ప చింతన్ శివిర్ లో తీసుకున్న నిర్ణయాలతో పార్టీకి పునర్ వైభవం వస్తుందని కాంగ్రెస్ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: MLC Ananthababu: హంతకుడిని గారూ అని సంబోధిస్తారా! కాకినాడ ఎస్పీపై జనాల ఫైర్..
READ ALSO: Monkeypox Scare: మంకీపాక్స్ కేసుల వ్యాప్తి నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో హైఅలర్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook