BJP Unveils Sankalp Patra Manifesto: సంకల్ప పత్ర పేరిట బీజేపీ మేనిఫెస్టో విడుదల.. 70 యేళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచిత ఆరోగ్య బీమా..

BJP Unveils Sankalp Patra Manifesto: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టో విడుదల చేసింది. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తన సంకల్ప పత్రాన్ని ధిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 14, 2024, 10:39 AM IST
 BJP Unveils Sankalp Patra Manifesto: సంకల్ప పత్ర పేరిట బీజేపీ మేనిఫెస్టో విడుదల.. 70 యేళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచిత ఆరోగ్య బీమా..

BJP Unveils Sankalp Patra Manifesto:దిల్లీలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్‌ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ ఈ ఎన్నికల మేనిఫేస్టోను ఆవిష్కరించారు. సార్వత్రిక ఎన్నికలకు 'సంకల్ప పత్రం'లో మోదీ గ్యారంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో ఈ మేనిఫేస్టోను తయారు చేసారు. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్‌ థీమ్‌తో రూపొందించారు. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో 27 మంది సభ్యుల కమిటీ సంకల్ప పత్రాన్ని రెడీ చేసింది. మేనిఫేస్టో కోసం దాదాపు 15 లక్షల సలహాలు సూచనలు పరిశీలించిన తర్వాత ఈ మేనిఫోస్టోను రెడీ చేసినట్టు చెప్పారు.  సంకల్ప పత్ర పేరిట భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ ఎన్నికల మేనిఫెస్టోను  విడుదల చేసారు.  ఇందులో పేద, మధ్యతరగతిని ఆకట్టుకునే పలు ఆకర్షణమైన పథకాలకు తన మేనిఫేస్టోలో చోటు కల్పించింది. అంతేకాదు దేశంలో 70 యేళ్లు నిండిన బీద, మధ్య తరగతి సహ ప్రతి ఒక్క సీనియర్ సిటీజన్‌కు రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమాను.. ఆయుష్మాన్ భారత్ కింద అమలు చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో దేశంలోని దాదాపు రూ. 20 కోట్లకు పైగా కుటుంబాలకు లబ్ధి చూకూరనుంది.

 

అభివృద్ది, సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే యువజన సాధికారిత, స్త్రీ సంక్షేమం, రైతు, అణగారిణ వర్గాల అభివృద్ది కోసం బీజేపీ తన ఎన్నికల మేనిఫేస్టోను ప్రకటించింది. దేశంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సంకల్ప పత్రను విడుదల చేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ తరుపున ఆ పార్టీ అగ్ర నేత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించడం విశేషం. మరోవైపు దేశంలో కోట్లాది ప్రజలకు ఇల్లు కట్టిస్తానని హామి ఇచ్చారు. మరోవైపు ఒకే దేశం ఒకే ఎన్నిక, కామన్ సివిల్ కోడ్ వంటి పలు చట్టాలను ఈ సారి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించారు.

మొత్తంగా 14 అంశాల ఆధారంగా బీజేపీ తన ఎన్నికల మ్యానిఫేస్టోను విడుదల చేసింది. అందులో విశ్వబంధు, సమృద్ధ భాతర్, సురక్షిత భారత్, ఈజ్ ఆఫ్ లివింగ్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, వరల్డ్ వైడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సాంస్కృతిక వికాసం, సుస్ధిర భారత్ వంటివి ఇందులో ప్రస్తావించారు.

Read More: Sonu Sood: షూ చోరీ చేసిన స్విగ్గీ డెలీవరీ బాయ్ కు సోనూసూద్ అండ.. కొత్త బూట్లు కొనివ్వండంటూ ట్వీట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News