India China Border Clash: తవాంగ్‌లో ఇండో-చైనా సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణతో పార్లమెంట్‌లో హీటెక్కింది. అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధ జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ పాలనలో భారతదేశంలో ఒక్క అంగుళం భూమిని కూడా తీసుకునే సాహసం ఎవరూ చేయరని స్ఫష్టం చేశారు.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై ఆయన స్పందించారు. 1962లో చైనా చాలా భాగాన్ని ఆక్రమించిందని.. అయితే ఇప్పుడు ఒక్క అంగుళం భూమిపై కూడా తీసుకునేందుకు తాము అనుమతించబోమన్నారు. దేశంలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉందన్నారు. గాల్వాన్‌లో చైనా సైన్యంతో మన సైనికులు పోరాడుతున్నప్పుడు కాంగ్రెస్ నేతలు చైనా నేతలతో సమావేశమయ్యారని విమర్శించారు.
'చైనా బెదిరింపుతో సరిహద్దులోని డెమ్‌చోక్‌లో రోడ్లు, మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. కాంగ్రెస్ హయాంలో మన దేశం నుంచి వేల కిలోమీటర్ల భూములు లాక్కున్నారు. మోదీ ప్రభుత్వం ఉన్నంత కాలం భారత దేశంలోని అంగుళం భూమిని ఎవరూ స్వాధీనం చేసుకోలేరు.
నేను ప్రశ్నోత్తరాల జాబితాను చూశాను. ప్రశ్న సంఖ్య 5 చూసిన తర్వాత.. కాంగ్రెస్ ఆందోళనను అర్థం చేసుకున్నాను. ప్రశ్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (RGF) ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) లైసెన్స్ రద్దుకు సంబంధించినది ఆ ప్రశ్న. వారు అనుమతిస్తే.. 2005-2007 మధ్య కాలంలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనా రాయబార కార్యాలయం నుంచి రూ. 1.35 కోట్ల గ్రాంట్‌ను పొందింది. నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ దాని రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది..' అని అమిత్ షా తెలిపారు.
అంతకుముందు తవాంగ్‌లో చైనా, భారత్ సైనికుల మధ్య జరిగిన వాగ్వివాదంపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్ ఉభయ సభలలో ప్రకటన ఇచ్చారు. 2022 డిసెంబర్ 9న సరిహద్దులోని తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నించిందని అన్నారు. చైనా చేసిన ఈ ప్రయత్నాన్ని భారత సైన్యం ధైర్యంగా ఆపిందని ఆయన చెప్పారు. ఈ ఘర్షణలో ఎవరూ తీవ్రంగా గాయపడలేదన్నారు.
Also Read: RBI Penalty On Banks: 13 బ్యాంక్‌లకు షాకిచ్చిన ఆర్బీఐ.. ఆ తప్పుకు భారీ జరిమానా
Also Read: Pragathi Workouts : బీస్ట్ మోడ్.. భారీ వర్కౌట్లు.. ప్రగతి వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook