Pregnancy Cyber Scam: గర్భవతుల్ని చేస్తే రూ. 10 లక్షల ఘటన.. వెలుగులోకి వస్తున్న విస్తుపోయే విషయాలు..

Bihar News: మహిళల్ని గర్బవతుల్ని చేస్తే భారీగా డబ్బులు సంపాదించ వచ్చని ప్రకటన చూసి చాలా మంది యువత టెంప్ట్ అయ్యారు. దీంతో ఈ ప్రకటన వెనకాల భారీ మోసం బైటపడింది. దీంతో ప్రస్తుతం చాలా మంది లబో దిబొ మంటున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 11, 2025, 05:33 PM IST
  • రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు..
  • కొత్త మార్గంలో దోపిడీ
Pregnancy Cyber Scam: గర్భవతుల్ని చేస్తే రూ. 10 లక్షల ఘటన.. వెలుగులోకి  వస్తున్న విస్తుపోయే విషయాలు..

bihar police bust pregnancy cyber scam: ఇప్పటి వరకు సైబర్ నేరగాళ్లు ఇంట్లో వాళ్లు లేదా ఫ్రెండ్స్ ల డీపీలు పెట్టుకుని వాట్సాప్ లు, ఫెస్ బుక్ మెస్సెంజర్ లలో డబ్బులు డిమాండ్ చేయడంమనం చూశాం.అంతే కాకుండా.. ఏవో లింక్ లు పెట్టి మోసం చేయడం చూశాం. అంతే కాకుండా.. అమ్మాయిల మాదిరిగా క్యూట్ గా మాట్లాడి హనీ ట్రాప్ చేసిన ఘటనలు చూశాం. అంతే కాకుండా.. హస్కీగా మాట్లాడి, న్యూడ్ వీడియో కాల్స్ చేసి అవతలి వారిని బెదిరింపులకు గురిచేసి సైబర్ నేరాలకు పాల్పడిన వారిని చూశాం. ఇక సైబర్ నేరగాళ్లు సైతం ఎప్పటి కప్పుడు అప్ డేట్ అవుతున్నారు.

తమ పంథాను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఫోన్లకు లింక్ లను పంపడం,  బిజినెస్ అంటూ.. డిజిటల్ అరెస్ట్ అంటూ.. మీ వాళ్లను జైళ్లలో పెట్టారంటూ.. ఇలా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు చిక్కకుండా కొత్త మార్గాలలో చోరీలకు పాల్పడుతున్నారు. అయితే.. బీహర్ లో ఒక కొత్త తరహా స్కామ్ వెలుగులోకి వచ్చింది.

ఇక్కడ పెళ్లి అయిన మహిళల్ని ప్రెగ్నెంట్ చేస్తే భారీగా డబ్బులు చెల్లిస్తామని ప్రకటనలు చేశారు. అంతే కాకుండా.. ఇటీవల చాలా మంది మహిళలు పెళ్లి తర్వాత శారీరక సమస్యల వల్ల సంతానం లేక ఇబ్బందులు పడుతుంటారు. దీనిలో కొన్ని కేసుల్లో పురుషుల్లో వంధ్యత్వం, శుక్రకణాల లోపం కూడా ఉంటున్నాయి. ఇలాంటి ఘటనలను వీరు ఈ స్కామ్ కు ఉపయోగించుకున్నట్లు తెలుస్తొంది.

ముఖ్యంగా మహిళల్ని ప్రెగ్నెంట్ చేస్తే... రూ.10 లక్షలు పొందొచ్చని ప్రకటించారు. ఒకవేళ ఏదైన కారణంలో సక్సెస్ కాకుంటే.. రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకూ పొందొచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో చాలా మంది యువత.. వీరు ప్రకటన చేసిన ఫోన్ నంబర్ లకు సంప్రదించారు. అంతేకాకుండా.. హోటల్ ల బుక్కింగ్ లు, వాట్సాప్ ఛాట్, ఫోటోలు , ఆధార్ ఐడీలు మొదలైనవి ఈ స్కామ్ వాళ్లు తీసుకున్నారు.

ఆతర్వాత బాధితుల నుంచి ముందస్తు చార్జీల పేరిట అందిన కాడికి తీసుకున్నారు. యువత సైతం.. కక్కుర్తీ పడి.. ఈ స్కామ్ బారిన పడ్డారు.  చివరకు మోసపోయామని గ్రహించి..  బాధితులు పోలీసుల్ని ఆశ్రయించి.. ఈ ఘటనపై ఫిర్యాదుచేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Read more: Snake Viral Video: ఇది మాములు ఫైటింగ్ కాదు భయ్యా.. వీడియో చూస్తే భయంతో జడుసుకుంటారు..

దీనిపై రంగంలోకి దిగిన బీహర్ పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిని ప్రిన్స్ రాజ్, భోలా కుమార్, రాహుల్ కుమార్‌లుగా గుర్తించారు. వారి వద్ద నుంచి 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద బాధితుల వాట్సప్ ఛాట్, కస్టమర్ ఫోటోలు, ఫోన్ కాల్స్, బ్యాంక్ లావాదేవీలను గుర్తించారు. దీనిలో ఇంకొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ స్కామ్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News