November Bank Holidays: ప్రస్తుతం ఎంత ఆన్‌లైన్ చెల్లింపులు, డిజిటల్ లావాదేవీలు నడుస్తున్నా కొన్ని పనుల కోసం మాత్రం బ్యాంకులకు వెళ్లక తప్పడం లేదు. అందుకే బ్యాంకులకు సెలవులు ఎప్పుడున్నాయో తెలుసుకుని వెళ్లడం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆర్బీఐ ఎప్పటిలానే నవంబర్ నెల సెలవుల జాబితా విడుదల చేసింది.
నవంబర్ నెలలో వీక్లీ సెలవులైన రెండు, నాలుగు శనివారాలు, నాలుగు ఆదివారాలతో పాటు ఇతర సెలవులున్నాయి. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కారణంగా సెలవులున్నాయి. ఇలా మొత్తం 13 రోజులు నవంబర్ నెలలో బ్యాంకులకు వివిధ రాష్ట్రాల్లో సెలవులున్నాయి. నవంబర్ 1న అగర్తల, బేలాపూర్, బెంగళూరు, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, జమ్ము, ముంబై, నాగ్‌పూర్, షిల్లాంగ్, శ్రీనగర్‌లో దీపావళి అమావాస్య పురస్కరించుకుని సెలవు ఉంది.
ఇక నవంబర్ 2న అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, జైపూర్, కాన్పూర్, ముంబై, నాగ్‌పూర్, లక్నోలలో బాలి ప్రతిపద సెలవు ఉంది. నవంబర్ 3 ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంది.
నవంబర్ 7న కోల్‌కత్తా, రాంచి, పాట్నాలో ఛత్ ఫెస్టివల్ పురస్కరించుకుని సెలవు. నవంబర్ 8న ఛత్ ఫెస్టివల్ సందర్భంగా షిల్లాంగ్ సహా పాట్నా, రాంచీల్లో బ్యాంకులకు సెలవు.
నవంబర్ 9 రెండవ శనివారం సెలవు కాగా నవంబర్ 10 ఆధివారం సెలవు ఉంది.
నవంబర్ 12 డెహ్రాడూన్‌లో బ్యాంకులకు సెలవు
నవంబర్ 15న గురునానక్ జయంతి సెలవు
నవంబర్ 17 ఆదివారం సెలవు
నవంబర్ 23 నాలుగో శనివారం సెలవు, నవంబర్ 24 ఆదివారం సెలవు
Also read: Kerala Fire Incident: బాణాసంచా పేలిన భయానక దృశ్యం.. 150 మందికి పైగా గాయాలు.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.