PM Narendra Modi: ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) తాజాగా తన ట్విటర్ ఖాతా(Twitter) ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చారు. దేశం 100 కోట్ల కరోనా టీకా డోసుల్ని పంపిణీ చేసి(100 crore vaccine doses), కీలక మైలురాయి దాటిన వేళ.. ఆ ఘనతను ప్రతిబింబించే చిత్రాన్ని ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు.
కరోనా టీకా వయల్, 100 కోట్ల డోసుల పంపిణీ, కరోనాపై పోరాటం చేసిన యోధులు ఈ చిత్రంలో కనిపిస్తున్నారు. కొవిడ్ మహమ్మారి(CoronaVirus)పై పోరాటంలో భాగంగా.. భారత్ జనవరి 16న కరోనా టీకా కార్యక్రమాన్ని(Corona Vaccination) ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొమ్మిది నెలల వ్యవధిలో అంటే అక్టోబర్ 21 నాటికి 100 కోట్ల డోసుల పంపిణీ అయ్యాయి. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదురైనా.. ప్రభుత్వం, వైద్య సిబ్బంది, ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగారు.
Also Read:India Crosses 1 Billion Vaccination: భళా 'భారత్'.. 100 కోట్ల టీకాల పంపిణీ పూర్తి
నవ భారత్‌కు ప్రతీక
‘మోదీ మాట్లాడుతూ...''టీకా పంపిణీలో 100 కోట్ల డోసులు అనేది కేవలం సంఖ్య కాదు. దేశ సంకల్ప బలం. దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం. నవ భారతానికి ప్రతీక’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. కరోనా మహమ్మారి కోరలు వంచే వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త చరిత్రను లిఖించిన సందర్భంగా ప్రధాని నేడు దేశ ప్రజలనుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. దేశ ప్రజల కర్తవ్య దీక్ష వల్లే ఈ లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. వీఐపీ(VIP) సంస్కృతికి తావు లేకుండా ప్రతి ఒక్కరికీ టీకాలు అందజేస్తున్నామని తెలిపారు. దేశంలో వ్యాక్సినేషన్‌పై ఎదురైన ఎన్నో ప్రశ్నలు, సవాళ్లకు.. ‘100 కోట్ల ఘనతే''’ జవాబు అని ఆయన అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి