Republic Day 2022: దేశ రాజధాని ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ వందనం చేసి ఈ వేడుకల్ని ప్రారంభించారు. ఇక విశిష్ట సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలు ప్రదానం చేశారు.
2020 ఆగస్టులో ముగ్గురు టెర్రిరిస్ట్‌లను హతం చేసిన జమ్మూకశ్మీర్ పోలీసు బాబురామ్‌కు అశోక్ చక్ర పురస్కారం వరించింది. ఈ అవార్డ్‌ను ఆయ మరణానంతరం ప్రకటించారు. బాబురామ్ కుటుంబసభ్యులు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు.
ఇక రాజ్‌పథ్‌లో (Rajpath) గణతంత్ర పరేడ్ (Republic Day Parade) జరిగింది. దేశ సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పేలా పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు.
ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు, పరేడ్ ఆద్యంతం ఆకట్టుకుంది.
వాయుసేన విన్యాసాలతో శకటాల ప్రదర్శనతో పరేడ్ ఆద్యంతం ఆకట్టుకుంది.
ఇక దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఈ ఏడాదితో 75ఏళ్లు పూర్తికానుండడంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేటి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌లలో పలు ప్రత్యేకతలు చోటు చేసుకున్నాయి.
రిపబ్లిక్ డే (Republic Day) కవాతులో ఫస్ట్‌టైమ్ భారత వాయుసేనకు చెందిన 75 విమానాల విన్యాసాలు జరుగుతున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్త పోటీల నుంచి ఎంపిక చేసిన 480 గ్రూప్స్‌తో సాంస్కృతిక ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.
రిపబ్లిక్ డే సందర్భంగా రక్షణ, సాంస్కృతిక మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో 600 మంది ప్రముఖ చిత్రకారులు రూపొందించిన చిత్రాల ప్రదర్శన కూడా కొనసాగుతోంది.
ఇక రాజ్‌పథ్ మార్గంలో అటూ ఇటూ ఐదు చొప్పున పది భారీ ఎల్‌ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ డే వేడుకల విశేషాలను, సాయుధ దళాలపై చిత్రీకరించిన షార్ట్ ఫిల్మ్స్‌ను పరేడ్‌కు ముందు ఎల్‌ఈడీ స్క్రీన్స్‌లలో ప్రదర్శించారు.
ఏటా ఉదయం 10 గంటలకు పరేడ్ ప్రారంభమవుతుండగా.. ఈ సారి ఢిల్లీలో వాతావరణ పరిస్థితుల వల్ల అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది.గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమరవీరులకు నివాళులర్పించారు.
ఇండియాగేట్ సమీపంలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు ప్రధాని మోదీ. ఇక అక్కడ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు వందనం చేశారు ప్రధాని. జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన అనంతరం.. అక్కడి నుంచి రాజ్‌పథ్ చేరుకుని గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ.
Also Read : Republic Day 2022: రిపబ్లిక్ డే పరేడ్ కు ముందు అమరవీరులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులు
రిపబ్లిక్ డే వేడుకల్లో (Republic Day) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
Also Read : Telangana Vaccination: కరీంనగర్ రికార్డు- 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.