Kerala Fire Incident: బాణాసంచా పేలిన భయానక దృశ్యం.. 150 మందికి పైగా గాయాలు.. వీడియో వైరల్‌

Kerala Fire Shocking visuals: పండుగ ముందు విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా పేలి ఎనిమిది పరిస్థితి విషమించడంతోపాటు మరో 150 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి కేరళ కాసరగోడ్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన వారిని కన్నూర్‌, కాసర్‌గఢ్‌, మంగళూరులోని వివిధ ఆస్పత్రిల్లో చేర్పించారు.  విరకంబు ఆలయ పరిసరా ప్రాంతాల్లో భారీ ఎత్తున బాణాసంచా నిల్వ చేయడంతో ఆ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Written by - Renuka Godugu | Last Updated : Oct 29, 2024, 09:57 AM IST
Kerala Fire Incident: బాణాసంచా పేలిన భయానక దృశ్యం.. 150 మందికి పైగా గాయాలు.. వీడియో వైరల్‌

Kerala Fire Shocking visuals: కేరళలోని కాసర్‌గఢ్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఎత్తున బాణా సంచా నిల్వ చేయడంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు ఎనిమింది మరిస్థితి విషమించగా మరో 150 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.  ఈ ప్రమాదం అర్ధరాత్రి చోటుచేసుకుందని అధికారులు చెబుతున్నారు.ప్రమాద స్థలానికి వెంటనే చేరుకున్న పోలీసులు, అధికారులు ప్రమాదానికి కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. బాణసంచా పేలుడులో చిక్కుకున్నవారిని కాపాడేందుకు స్థానికులు కూడా తీవ్ర ప్రయత్నం చేశారు.

అధికారుల ప్రకారం కాసర్‌గాఢ్ నీలేశ్వేరం ఆలయంలో కాళీయపట్ట ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అర్థరాత్రి 12 గంటలు దాటింది. ఇప్పటికే చాలామంది జనం గుడి పరిసర ప్రాంతాల్లో గుమిగూడారు. తియ్యంకోలం చూడటంలో మునిగి పోయారు. ఆలయ వేడుకల్లో భాగంగా పటాకులు పేల్చారు. వీటి నిప్పు రవ్వలు ఎగిరి పక్కనే నిబంధనలు విరుద్ధంగా నిల్వ చేసిన బాణసంచాపై పడింది. దీంతో ఒక్కసారిగా జరిగిన పేళుళ్లకు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఉరుకులు, పరుగులు తీస్తూ కేకలు వేశారు. అప్పటికే పరిస్థితి విషమించింది. మంటల్లో ఒక్కసారిగా అలుముకోవడంతో ఎనిమిందికి 80 శాతంపైగా గాయాల అయ్యాయి. 150 మందికి పైగా తీవ్ర గాయాల పాలు అయ్యారు.అధికారుల ప్రకారం ఇలా ఆలయ పరిసర ప్రాంతాల్లో బాణాసంచా నిల్వ చేయడానికి ఎటువంటి పర్మిషన్‌ తీసుకోలేదు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

 

యాకుత్‌పురా..
ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో కూడా రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నారు. అబిడ్స్‌లోని బొగ్గుల కుంటలో కూడా పటాకుల విక్రయాల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం చోటు చేసుకోలేదు. ఈ ఘటన మరువక ముందే యాకుత్‌పురాలో మరో ఘోరం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో నిల్వ ఉంచిన బాణాసంచా ఉండగా సిలిండర్‌ పేలి ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో నిబంధనలు పాటించకుండా ఇలా భారీ ఎత్తున బాణసంచా నిల్వ చేయడం వల్లే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు. ఫైర్‌ సేప్టీ నియమాలను పాటించాలని చెబుతన్నారు. 

ఇదీ చదవండి : పవన్ కళ్యాణ్ బాటలో విజయ్ రాజకీయం..

ఈ సిలిండర్‌ పేలిన ఘటన యాకుత్‌పురా రైల్వే స్టేషన్‌ దగ్గర చోటు చేసుకుంది.ఈ ఘటనలో భారీ ఎత్తున మంటల చేలరేగాయి దీంతో ఆ ఇంట్లో ఉండే దంపతులు మోహన్‌ లాల్‌ (55), ఉష (50) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఓ అమ్మాయికి మాత్రం గాయాలయ్యాయి. వీరి ఇళ్లు కూడా పూర్తిగా ధ్వంసం అయింది.

ఇదీ చదవండి : దీపావళి ముందు భారీగా ఐఏఎస్‌లు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు.. ఆ డేరింగ్ లేడీ ఆఫీసర్‌కు కీలక బాధ్యతలు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News