జమ్మూ కాశ్మీర్ లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా ( National conference leader ) కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి సంచలనం రేపారు.
ప్రత్యేక స్వయంప్రతిపత్తితో కూడిన రాష్ట్రం నుంచి కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కశ్మీర్లో త్వరలో ఎన్నికల జరగాల్సి ఉంది. రాష్ట్రంలో కీలకపార్టీగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా ( Omar Abdullah ) ముందు నుంచీ కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగించడంపై వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు తాజాగా అసలు ఎన్నికల్లోనే పోటీ చేయనంటూ సంచలనం రేపారు. జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నంతవరకూ ఎన్నికల్నించి తప్పుకుంటున్నట్టు స్పష్టం చేశారు. సాధికారత లేని అసెంబ్లీలో సభ్యుడిగా ఉండటం ఇష్టం లేదన్నారు.
దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో జమ్మూ కశ్మీర్ ( Jammu & Kashmir ) పాల్గొందని...అభివృద్దిలో భాగమైందని ఒమర్ అబ్దుల్లా చెప్పారు. కానీ జమ్ము కశ్మీర్ కు ఇచ్చిన వాగ్దానం మాత్రం నెరవేరలేదన్నారు. ఆర్టికల్ 370 తొలగింపుకు జనామోదం ఉండి ఉండవచ్చు కానీ...దేశ సార్వభౌమ విధానానికి వ్యతిరేకంగా ఒమర్ అబ్దుల్లా అభివర్ణించారు. Also read:Time capsule: రామ మందిరం కింద 2 వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సుల్
ఆర్టికల్ 370 ( Article 370 ) తొలగింపు నేపధ్యంలో పబ్లిక్ సేఫ్టీ చట్టం ( Public safety act ) కింద ఒమర్ అబ్దుల్లాను 8 నెలల పాటు గృహ నిర్బంధంలో ఉంచింది కేంద్ర ప్రభుత్వం. మార్చ్ 13న విడుదలయ్యారు. Also read: Rajasthan Crisis: సుప్రీంకోర్టులో వెనక్కి తగ్గిన రాజస్థాన్ ప్రభుత్వం