Black Coffee: బ్లాక్ కాఫీ వర్సెస్ బెడ్ కాఫీ, ఏది ఆరోగ్యానికి మంచిది, బ్లాక్ కాఫీతో అధిక బరువుకు చెక్

Black Coffee: బెడ్ కాఫీ, బ్లాక్ కాఫీ రెండూ ఒకటి కాదా..కానేకాదు. బెడ్ కాఫీ కంటే బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిది. స్థూలకాయం సమస్యకు సైతం బ్లాక్ కాఫీ చెక్ పెడుతుంది. బ్లాక్ కాఫీతో కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 30, 2022, 09:25 PM IST
Black Coffee: బ్లాక్ కాఫీ వర్సెస్ బెడ్ కాఫీ, ఏది ఆరోగ్యానికి మంచిది, బ్లాక్ కాఫీతో అధిక బరువుకు చెక్

Black Coffee: బెడ్ కాఫీ, బ్లాక్ కాఫీ రెండూ ఒకటి కాదా..కానేకాదు. బెడ్ కాఫీ కంటే బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిది. స్థూలకాయం సమస్యకు సైతం బ్లాక్ కాఫీ చెక్ పెడుతుంది. బ్లాక్ కాఫీతో కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..

ఆరోగ్యపరంగా బ్లాక్‌కాఫీ చాలామంచిది. అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నవారికి బ్లాక్ కాఫీ మంచి పరిష్కారం. బ్లాక్ కాఫీతో బరువు తగ్గుతుందంటున్నారు వైద్య నిపుణులు. చెడు కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. బ్లాక్‌కాఫీతో గుండె జబ్బులు, డయాబెటిస్ ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. 

బ్లాక్‌కాఫీలో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే శరీరాన్ని విష వ్యర్థాల నుంచి కాపాడే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. కాఫీలో ఉండే కెమికల్ కాంపౌండ్లు చాలా శక్తిమంతమైనవి అవి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా ప్రాణాలు తీసే కాన్సర్ వ్యాధి రాకుండా కాఫీ అడ్డుకోగలదని నిపుణులు చెబుతున్నారు.

బ్లాక్ కాఫీతో అధిక బరువుకు చెక్

అమెరికా వ్యవసాయ విభాగం అధ్యయనం ప్రకారం..కాఫీ గింజలతో తయారుచేసిన ఓ కప్పు బ్లాక్‌కాఫీలో 2 కేలరీలు ఉంటాయి. అంటే కాఫీలో కేలరీలు తక్కువే. అయితే.. కాఫీకి అదనంగా బెల్లం, పంచదార, పాలు, వెనీలా, సోయా మిల్క్, చాకొలెట్ సిరప్ వంటివి జత చేయకుండా తాగితే మంచిది. బ్లాక్‌‌కాఫీలో క్లోరోజెనిక్‌ యాసిడ్‌ అనే పదార్థం కూడా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బ్లాక్‌‌కాఫీలో క్లోరోజెనిక్‌ యాసిడ్‌ ఉండటం వల్ల రాత్రి భోజనం తర్వాత శరీరంలో గ్లూకోజ్‌ ఉత్పత్తి ఆలస్యం అవుతుంది.  

కెఫీన్ ఆరోగ్యానికి మంచిదేనా

బ్లాక్‌కాఫీలో ఉండే కెఫిన్‌ మన శరీరంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కెఫిన్‌ అనే పదార్థం మెదడును, కేంద్ర నాడీ వ్యవస్థను చురుకుగా పని చేసేందుకు సహాయపడుతుంది. మనిషి శక్తి సామర్ధ్యం మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. 
బాడీలో నీరు ఎక్కువైతే కూడా బరువు పెరుగుతారు. ముఖ్యంగా పొట్ట పెరుగుతుంది. బ్లాక్‌కాఫీ బాడీలో అవసరం లేని నీటిని బయటకు పంపేస్తుంది. తరచూ యూరిన్‌కి వెళ్లడం వల్ల బాడీలో అదనపు బరువు తగ్గుతుంది. అందుకే బ్లాక్ కాఫీ తాగడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

గ్రీన్‌ కాఫీ గింజలు మన శరీరంలో కొవ్వును కరిగించే సామర్థ్యాన్ని పెంచేందుకు సహాయపడుతుంది. ఇది కాలేయానికి సహాజమైన క్లెన్సర్‌గా కూడా పని చేస్తుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ తొలగించి జీవక్రియ సమర్ధవంతంగా పని చేసేలా చేస్తుంది. ఫలితంగా బరువు తగ్గే ప్రక్రియ వేగవంతమౌతుంది.

Also read: Ageing Process: యౌవ్వనంలోనే వృద్ధాప్యం కన్పిస్తోందా..ఆ అలవాట్లు మానితే చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News