Chocolate Ice Cream Recipe In Telugu: ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలామంది కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలైతే రోజు కావాలని మారం చేస్తూ ఉంటారు. దీనికి కారణంగా చాలామంది బయట లభించే స్టోర్లలో ఐస్ క్రీమ్స్ కొనుగోలు చేసి రిఫ్రిజిరేటర్ లో స్టోర్ చేస్తున్నారు అయితే ఇలాంటి ఐస్ క్రీమ్స్ ని ఎక్కువగా తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు రావచ్చు ముఖ్యంగా పిల్లల్లోని శరీర పెరుగుదల తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటికి బదులుగా న్యాచురల్ గా ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా మంచిది.
ఇంట్లో చాక్లెట్ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడం చాలా సులభం అయితే చాలామంది కొంత కష్టంగా భావించి ఎక్కువగా బయట లభించే స్టోరీలలో కొంటున్నారు. ఇకనుంచి అలా చెయ్యనక్కర్లేదు. మీ మందించే సింపుల్ పద్ధతిలో ఐస్ క్రీమ్ తయారు చేస్తే అచ్చం స్టోర్ లో లభించే టేస్ట్ నే పొందుతారు. ఇలా ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల డబ్బులు సేవ్ అవుతాయి. అంతేకాకుండా ఆరోగ్యము పాడవకుండా ఉంటుంది. అయితే ఇంట్లో చాక్లెట్ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి ఎలాంటి పదార్థాలను వాడాలో? తయారీ పద్ధతి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చాక్లెట్ ఐస్ క్రీం రెసిపీ (Chocolate Ice Cream Recipe)
కావలసిన పదార్థాలు (Ingredients):
✾ ఫుల్ క్రీమ్ పాలు (Full Cream Milk) - 1 లీటరు (Liter)
✾ కొవ్వెక్కువ లేని పాల పొడి (Skimmed Milk Powder) - 1/4 కప్పు (Cup)
✾ చక్కెర (Sugar) - 1/2 కప్పు
✾ కోకో పొడి (Cocoa Powder) - 3 టేబుల్ స్పూన్లు (Tablespoons)
✾ వనిల్లా ఎక్స్‌ట్రాక్ట్ (Vanilla Extract) - 1/2 టీస్పూన్ (Teaspoon)
తయారీ విధానం:
✾ ముందుగా ఒక పెద్ద బండిని తీసుకోవాల్సి ఉంటుంది. అందులోనే పాలు, పాల పొడి, చక్కెర, కోకో పొడిని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
✾ ఇవన్నీ మృదువుగా పేస్ట్‌గా తయారయ్యేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.
✾ ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని స్టవ్‌పై పెట్టి మీడియం వేడి మీద ఉంచి కలుపుతూ ఉండాలి. మిశ్రమం మరిగేంతవరకు అలాగే కలుపుతూ ఉండాలి.
✾ ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని స్టవ్ పై నుంచి తీసి పక్కన పెట్టి వనిల్లా ఎక్స్‌ట్రాక్ట్‌ను మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మరో రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.
Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!
✾ ఆ తర్వాత ఇలా చివరి దశలోకి చేరుకున్న మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ మేకర్ లో పోసి ఆరు నుంచి ఏడు గంటల పాటు ఫ్రిజ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది.
✾ అదనంగా ఈ ఐస్ క్రీమ్ లో కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసుకోవచ్చు.
✾ అయితే ఐస్ క్రీమ్ ను ఫ్రిడ్జ్ లో పెట్టుకునే క్రమంలో మిశ్రమాన్ని గాలి చొరబడని డబ్బాలోకి పోసుకోవాలి. అంతే సులభంగా చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అయినట్లే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter