Public Provident Fund Scheme 2024: "పెద్దలు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటుంటారు. దీపం అంటే మన జీవితంలోని సుఖమయమైన కాలం. కష్టాలు రాకముందే మనం మన జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు కొత్తగా ప్రారంభించడం కష్టమవుతుంది. ఆలోచించి ఖర్చులు తగ్గించుకోవాలి. సేవింగ్స్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ఉంటాము. ప్రస్తుత కాలంలో డబ్బు పొదుపు చేయడం చాలా ముఖ్యమైన విషయంగా మారింది. అందుకే చాలా మంది తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు.
ప్రస్తుత కాలంలో డబ్బు పొదుపు చేయడం ఎంతో ముఖ్యం. అనవసర ఖర్చులు చేయడం వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.
పెళ్లి, పిల్లల చదువు, ఇల్లు కొనుగోలు వంటి భవిష్యత్తు అవసరాల కోసం డబ్బును పొదుపు చేయడం చాలా ముఖ్యం.
నేటి తరం డబ్బులను పొదుపు చేయడం కోసం కొన్ని మార్గాలను వెత్తుకుతున్నారు. మీరు కూడా సంపాదించిన డబ్బులను సేవ్ చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ స్కీమ్ మీకు ఎంతగానో ఉపయెగపడుతుంది.
ఈ స్కీమ్‌లో డబ్బులు పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో ఊహించని లాభాలు పొందుతారు. ఇంతకీ స్కీమ్ ఏంటి..? ఎలా ఈ స్కీమ్‌ను స్టార్ట్ చేయాలి అనే వివరాలు తెలుసుకుందాం.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనే స్కీమ్ మీరు సంపాదించిన డబ్బులను సేవ్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఈ బ్యాంక్, పోస్ట్‌ఆఫీస్‌లో ఈ పొదుపు పథకం అందుబాటులో ఉంటుంది.
ఈ స్కీమ్‌లో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి కూడా లక్షల్లో లాభం పొందవచ్చు. రోజుకు రూ. 70 పొదుపు చేస్తే మెచ్యూరిటీ నాటికి రూ. 6 లక్షలు పొందవచ్చు.
ప్రస్తుతం పీపీఎఫ్ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ వడ్డీ రేటు ను 3 నెలలకు ఒకసారి మార్చుకోవచ్చు.
ఒక ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్ ఖాతాలో గరిష్టంగా రూ. 1,50,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ మొత్తాన్ని ఒకేసారి లేదా చిన్న చిన్న పెట్టుబడి పెట్టవచ్చు.
ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 అయినా పెట్టుబడి పెట్టకపోతే ఖాతా మూసివేస్తారు.
ఈ స్కీమ్ 15 సంవత్సరాల మెచ్యూరిటీ కాలం కలిగి ఉంటుంది. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టడంపై ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తుంది.
ఇతర పెట్టుబడి ఎంపికలతో పోలిస్తే, పీపీఎఫ్ స్కీమ్‌లో రిస్క్ చాలా తక్కువ.
పీపీఎఫ్ స్కీమ్ గురించి మరింత వివరాల కోసం మీరు బ్యాంకు లేదా పోస్టాఫీసును సంప్రదించవచ్చు.