DA Arrears Announcement: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, 18 నెలల డీఏ బకాయిలు ఎవరికెంత వస్తుంది

DA Arrears Announcement: మరి కొద్దిరోజుల్లో అంటే ఫిబ్రవరిలో ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. 

DA Arrears Announcement: కరోనా సంక్షోభ సమయంలో నిలిపివేసిన 18 నెలల పెండింగ్ డీఏ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. వచ్చే బడ్జెట్ లో పెండింగు డీఏలను ప్రకటించే అవకాశాలున్నాయి. అదే అమలు జరిగితే లెవెల్ 1 ఉద్యోగులకు 12 వేల నుంచి 37 వేల వరకు అందుతాయి. లెవెల్ 13 ఉద్యోగులకు 1.44 లక్షల నుంచి 2.18 లక్షలు దక్కుతాయి. ఇక లెవెల్ 14 ఉద్యోగులకు 1.82 లక్షల నుంచి 2.24 లక్షలు అందుతాయి. 

1 /5

ఇక లెవెల్ 14 ఉద్యోగులకు 1 లక్ష 82 వేల నుంచి 2 లక్షల 24 వేల వరకూ అందుతాయి. అయితే డీఏ బకాయిలపై ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. బడ్జెట్‌లో కచ్చితంగా ఉంటుందని ఉద్యోగులు అంచనా వేస్తున్నారు. 

2 /5

డీఏ బకాయిలు చెల్లిస్తే ఎవరికి ఎంత మొత్తంలో డబ్బులు వస్తాయనేది తెలుసుకోవాలి. ఎవరికెంత డీఏ అనేది ఆయా ఉద్యోగుల పే స్కేల్ బట్టి ఉంటుంది. లెవెల్ 1 ఉద్యోగులకు 11,800 నుంచి 37,554 రూపాయలు లభిస్తాయి. లెవెల్ 13 ఉద్యోగులకు 1 లక్షా 44 వేల నుంచి 2 లక్షల 18 వేల వరకూ అందుతాయి.

3 /5

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో డీఏ బకాయిలపై కేంద్రం కీలక ప్రకటన చేస్తుందని అంచనా ఉంది. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చాలా ప్రయోజనం కలగనుంది. 

4 /5

కరోనా సంక్షోభం సమయంలో అన్ని దేశాల్లో ఆర్ధిక పరిస్థితి దిగజారింది. దాంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు అందాల్సిన డీఏలు జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకూ మొత్తం 18 నెలలు నిలిపివేసింది. ఈ డీఏలు చెల్లించాలంటూ చాలాకాలంగా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 

5 /5

దేశవ్యాప్తంగా దాదాపు కోటిమందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 18 నెలల పెండింగ్ డీఏ బకాయిల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడీ అంశంపై కీలకమైన అప్‌డేట్ వెలువడింది.