7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. జీతంలో ఒకేసారి భారీ పెంపు..!

7th Pay Commission Latest Updates: కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు పూర్తి కావడంతో మోదీ 3.౦ పరిపాలన మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు తమకు శుభవార్త వస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూలై నెలలో అలవెన్సుల పెంపుతోపాటు జీతాలు కూడా భారీగా పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీఏ పెంపు 4 నుంచి 5 శాతం వరకు ఉంటుందని అంటున్నారు.
 

  • Jun 18, 2024, 17:30 PM IST
1 /8

ఇటీవల రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌లు ప్రకటించాయి. ఉద్యోగులకు సిక్కిం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతున్నట్లు ప్రకటించాయి.   

2 /8

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా జూలై నెలలో గుడ్‌న్యూస్ ఉంటుందని ఆశతో ఉన్నారు. మార్చి నెలలో 4 శాతం డీఏ పెంచడంతో మొత్తం 50 శాతానికి చేరింది.  

3 /8

పెంచిన డీఏ జనవరి నెల నుంచి వర్తింపజేసింది. రెండో డీఏ పెంపు ప్రకటన ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఉండే అవకాశం ఉంది.    

4 /8

అయితే ఈసారి 5 శాతం డీఏ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీఏ 5 శాతం పెంచితే.. రూ.50 వేల సంపాదించే ఉద్యోగికి జీతంలో రూ.2,500 పెరుగుదల కనిపిస్తుంది. మొత్తం శాలరీ రూ.52,500 అవుతుంది.   

5 /8

డీఏ 5 శాతం పెంచితే.. రూ.50 వేల సంపాదించే ఉద్యోగికి జీతంలో రూ.2,500 పెరుగుదల కనిపిస్తుంది. మొత్తం శాలరీ రూ.52,500 అవుతుంది.   

6 /8

అంతేకాకుండా ప్రభుత్వం ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను దాదాపు 3 శాతం పెంచుతోంది. దీంతో ఒకేసారి ఉద్యోగుల జీతాల్లో బంపర్ పెరుగుదల ఉండనుంది.  

7 /8

AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా డీఏ, డీఆర్ పెంపుదల ఉంటుంది. జూలై నుంచి డిసెంబర్ వరకు AICPI డేటాను బేస్‌ చేసుకుని జనవరి డీఏను, జనవరి నుంచి జూన్ వరకు AICPI డేటా ఆధారంగా జూలై నెల డీఏ పెంపు ఉంటుంది.  

8 /8

గమనిక: ఈ సమాచారం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే అందజేసినది. వేతన రేటు పెంపుదలకు లేదా తదుపరి వేతన కమిషన్‌కు ఏర్పాటుపై అధికారిక సమాచారం కాదు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.