8th Pay Commission News in Telugu: జీతాలు భారీగా పెంచడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కొత్త వేతన సంఘం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ అందిస్తోంది. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకోనుంది.
8th Pay Commission News in Telugu: డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరిగాయి. దాంతో ఉద్యోగులంతా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు వీరి ఆనందం రెట్టింపు కానుంది. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం గురించి అప్‌డేట్ ఇది.
పదేళ్ల క్రితం 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 7వ వేతన సంఘం ఏర్పాటు చేసింది. ఈ సంఘం 2016 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రతి పదేళ్లకోసారి కొత్త వేతన సంఘం ఏర్పడాల్సి ఉంది. అందుకే 8వ వేతన సంఘం ఏర్పాటుకై డిమాండ్ అధికమౌతోంది.
8వ వేతన సంఘం ఏర్పడితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్ భారీగా పెరగనుంది. 8వ వేతన సంఘం ఇప్పుడు ఏర్పడితే అమల్లోకి వచ్చేటప్పటికి 2016 7వ వేతన సంఘం గడువు పూర్తవుతుంది.
8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరగనున్నాయి. కనీస వేతనం 18 వేల రూపాయలుంటే అది కాస్తా 34,560 రూపాయలవుతుంది. అంటే దాదాపు రెట్టింపు అవుతుంది.
అంటే 8వ వేతన సంఘం ఏర్పాటుతో ఉద్యోగు జీతాలు 92 శాతం పెరగనున్నాయి. ఇది కచ్చితంగా ఉద్యోగులకు ఓ వరం లాంటిది. అందుకే చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు.