Nayanthara Love Story: నయనతార బయోపిక్ ఆధారంగా.. వచ్చిన డాక్యుమెంటరీని తాజాగా నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈరోజు ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా విడుదలైన డాక్యుమెంటరీలో తన ప్రేమకు సంబంధించిన విషయాలను వెల్లడించింది.
సౌత్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార తెలుగు, తమిళ్ భాషల్లో వరుస సినిమాలు చేసి భారీ పాపులారిటీ అందుకుంది. ఇప్పుడు హిందీలో కూడా సినిమాలు చేస్తూ అలరిస్తున్న ఈ అమ్మడు, సౌత్ హీరోయిన్ అయినప్పటికీ బాలీవుడ్లో తన పాగా వేసి అత్యధిక పారితోషకం తీసుకుంటున్న.. హీరోయిన్గా రికార్డు సృష్టించింది.
ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరొకవైపు యాడ్స్ చేస్తూ భారీగా సంపాదిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఈ స్టేటస్ ను అందుకుంది నయనతార. తాజాగా ఈరోజు నయనతార పుట్టినరోజు ఈ సందర్భంగా ఆమెపై తీసిన డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది.
ఇందులో తన ప్రేమ, పెళ్లి విషయాన్ని వెల్లడించింది నయనతార. నయనతార విఘ్నేష్ శివన్ తో ఎలా ప్రేమలో పడింది అనే విషయాన్ని చెప్పుకొచ్చింది. నయనతార మాట్లాడుతూ.. పాండిచ్చేరి రోడ్లు నిర్మానుషంగా ఉన్నాయి. ఆరోజు విజయ సేతుపతి సార్ తో సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఇక నేను ఒకపక్క రాయి పైన కూర్చొని.. నా షాట్ కోసం ఎదురు చూస్తున్నాను.
ఆ సమయంలో ఒక్కసారిగా విగ్నేష్ ని చూసి ఆ క్షణం అతడి ప్రేమలో పడిపోయాను. ముఖ్యంగా ఎంత కష్టం ఉన్నా అతడి ముఖంలో నవ్వు ఏమాత్రం పోలేదు. పైగా కథ వివరించే విధానం , నటీనటులను చూసుకునే విధానం అన్ని కూడా నన్ను ఆకట్టుకున్నాయి. ఎందుకో సడన్గా అతనిపై ప్రేమ కలిగింది
అయితే నేను ఇదే విషయాన్ని విగ్నేష్ తో చెబితే, తాను నేను సిల్లీగా చెబుతున్నాను అనుకున్నాడు. ఐ మిస్ యు అని చెప్పగానే అతను కూడా ఐ మిస్ యు టూ మేడం అని అన్నారు. కానీ అప్పుడు నిజంగానే పెళ్లి చేసుకుందామని అడిగేసరికి ఇక తాను మారు మాట్లాడకుండా పెళ్లికి ఒప్పుకున్నారు అంటూ తన డాక్యుమెంటరీలో చెప్పుకొచ్చింది నయనతార. ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి