Samantha: ఆ ఒక్క పని మాత్రం చేయలేను.. సమంత బయటపెట్టిన షాకింగ్ నిజం..!

Samantha Q and A: ప్రస్తుతం సమంత హిందీ వెబ్ సిరీస్ సీటాడెల్ ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉంది. ఇందుకోసం బాలీవుడ్ అలానే టాలీవుడ్ మీడియాలకు ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ క్రమంలో అంతా చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ.. అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.

1 /6

ఆరోగ్య సమస్యలు వచ్చిన తరువాత సమంత.. కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అందుకు కారణంగానే సమంత, విజయ దేవరకొండతో చేసిన ఖుషి సినిమా కూడా ఎంతో ఆలస్యమైంది.

2 /6

యశోద, శాకుంతలం, ఖుషీ ఈ మూడు సినిమాల విడుదలకు ముందు సమంత తన పర్సనల్ లైఫ్ లో ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. అయితే ఆ సమస్యల నుంచి.. తనను తాను బయటపెట్టి.. ఫైనల్ గా ఎలాగోలా షూటింగ్ కంప్లీట్ చేసింది. 

3 /6

ముందుగా యశోద సినిమా విడుదల కాక ఆ తర్వాత.. కొద్ది గ్యాప్ ఇచ్చి శాకుంతలం, ఖుషీ.. చిత్రాలు విడుదలయ్యాయి. ఇక ఈ చిత్రాలలో యశోద, ఖుషి సినిమాలు సమంతకు ఒక మోస్తారు విజయాన్ని అందించాయి. కాగా ఆ తరువాత మళ్లీ కొద్ది రోజులు షూటింగులకు గ్యాప్ ఇస్తూ వచ్చింది ఈ హీరోయిన్. 

4 /6

ఇక ఇప్పుడు ఫైనల్ గా ఈమె నటించిన.. వెబ్ సిరీస్ సీటాడెల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఎన్నో ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్న సమంత.. తాజాగా తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది…

5 /6

ఈ నేపథ్యంలో ఒక అభిమాని సమంతను లావు అవ్వమని కోరగా.. తాను  మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నానని.. కాబట్టి బరువు పెరిగే ఒక పని మాత్రం తాను ఎప్పుడు చేయలేను అంటూ చెప్పుకొచ్చింది. అందుకు ముఖ్య కారణం డాక్టర్ తనకు డైట్ ఇచ్చిందని.. తాను ఆ డైట్ మాత్రమే ఫాలో కావాలని చెప్పుకొచ్చింది.   

6 /6

ఇక ఈ మధ్య సమంత.. చాలా సన్నగా అయిపోయిందని తన ఫోటోలు చూసినా అభిమానులు బాధపడిన సంగతి తెలిసిందే. ఇక వారికి సమంత చెప్పిన ఈ మాటలతో సమాధానం వచ్చింది. ఇక సమంత చెప్పిన మాటలు విని ఆమె అభిమానులు మాత్రం కొంత నిరాశకు గురవుతున్నారు. సమంత ఇంకా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుందని తనకు త్వరగా బాగా అవ్వాలని కోరుకుంటున్నారు.