Shruti Haasan Weight Loss Tips : కమలహాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ గా శృతిహాసన్ స్థానం గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15ఏండ్లు గడిచినా..అమ్మడి అందం ఏమాత్రం తగ్గలేదు. శృతి తన ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.
Shruti Haasan Weight Loss Secrets: అందాల నటి శృతిహాసన్.. తన ఫిట్ నెస్ కోసం ఆమె ఎంత తాపత్రయపడతారో అందరికీ తెలిసిన విషయమే. ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి ఇప్పటికే 15 సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పటికీ ఈ అమ్మడి అందం ఏమాత్రం చెక్కుచెదరడంలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ వయస్సు 38 సంవత్సరాలు దాటినప్పటికీ.. తన ఫిగర్ ను మైంటైన్ చేయడంలో ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా సలార్ సినిమాలో తళుక్కుమని మెరిసిన శృతి తన ఫిట్‌నెస్ విషయంలో పలు రహస్యాలను నెటిజన్లతో పంచుకున్నారు. వాటిలో ముఖ్యంగా తాను ఎలాంటి డైట్ పాటించకుండానే బరువు తగ్గినట్లు ఆమె పేర్కొన్నారు. అయితే ఆ డైట్ రహస్యాలు ఏంటో అలాగే ఆమె చేసే ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శృతిహాసన్ మొదటి నుంచి కూడా బొద్దుగుమ్మగా ఉండేది. మొదట్లో గాయనిగా తన పేరు సంపాదించుకోవాలని ఆశపడింది. కానీ శృతిహాసన్ అందాన్ని చూసి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు హీరోయిన్ గా ట్రై చేయమని ప్రోత్సహించాడు. ఆయన సొంత బ్యానర్ లోనే అనగనగా ఒక ధీరుడు అనే సినిమా ద్వారా శృతిహాసన్ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు. అయితే అమ్మడు లావుగా ఉన్నప్పటికీ సినిమా ప్రారంభం అయ్యే నాటికి మెరుపుతీగల మారి మొదట లక్ అనే బాలీవుడ్ సినిమాలో తళుక్కుమన్నారు. ఆ తరువాత అనగనగా ఒక ధీరుడు సినిమాలో అతిలోకసుందరిగా అమ్మడు కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
బొద్దుగుమ్మ నుంచి సన్నజాజిగా మారిన శృతిహాసన్ ఫిట్ నెస్ సీక్రెట్ ల గురించి అందరూ తెలుసుకోవాలని ఉత్సాహం చూపించడం సహజమే. అయితే శృతిహాసన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను బరువు తగ్గే విషయంలో ఎలాంటి డైటింగ్ పాటించ లేదని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు. అయితే ఈ విషయంలో తాను కడుపు మాడ్చుకోకుండా శరీరానికి కావలసిన ఆహారాన్ని అందిస్తూనే ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకున్నట్లు తెలిపారు. తాను తీసుకునే ఆహారంలో ప్రతిరోజు గ్రిల్డ్ చికెన్, గ్రీన్ వెజిటబుల్స్, సలాడ్స్, అరడజను కోడిగుడ్ల వైట్, సూప్, ఇడ్లీ సాంబార్ తన మెనూలో ఉండడం తప్పనిసరి. అని ఆమె చెప్పుకొచ్చారు.
డైట్ ఎలా ఉన్నప్పటికీ వ్యాయామం విషయంలో మాత్రం శృతిహాసన్ ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేది కాదు. ఆమె కార్డియో ఎక్సర్ సైజులు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడేవారు. తద్వారా ఆమె శరీరంలో కొవ్వు తగ్గించుకోవడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు..ఎముకలను బలంగా ఉంచుకునేందుకు ఈ ఎక్సర్ సైజులను చేసేవారు. దీంతోపాటు ఆమె ట్రెడ్ మిల్ పైన వాకింగ్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. తద్వారా పొట్ట తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.
ఇక శృతిహాసన్ తన ఫిట్నెస్లో ప్రధానంగా డాన్స్ కూడా ఒక కారణమని చెప్పారు. డాన్స్ వల్ల తన బాడీ ఫ్లెక్సిబుల్ గా మారిందని అదనపు కొవ్వు తొలగిపోయిందని శరీరం నుంచి ఆమె పేర్కొన్నారు.ఇక తన ఇష్టమైన ఆహారం విషయానికి వస్తే అన్నంతో పాటు బంగాళదుంప వేపుడు అంటే తనకు చాలా ఇష్టమట. గతంలో తాను చేపలను ఎక్కువగా తినే దానిని అయితే అలా తినడం వల్ల తనకు ఎలర్జీ వచ్చిందని.. అందుకే షెల్ ఉన్న చేపలను తినడం మానేశానని చెప్పుకొచ్చారు.