Sobhita Dhulipala: తల్లిదండ్రులు కాంబోతున్న శోభిత - చైతూ.. శోభిత బేబీ బంప్ ఫోటోలు వైరల్..!

Sobhita Dhulipala baby bump: గత కొన్నిరోజులుగా శోభిత.. గర్భవతి అయిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు విషయం కాస్త వైరల్ గా మారింది. అంతేకాదు శోభిత బేబీ బంప్ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అసలు ఈ వార్తలో నిజం ఎంతుంది.. ఈ ఫోటోలు వెనుక కథ ఏమిటి ఒకసారి చూద్దాం..?

1 /5

నాగచైతన్య, హీరోయిన్ శోభిత ఇద్దరూ ప్రేమించుకుని గత ఏడాది డిసెంబర్ నెలలో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి  నాగచైతన్య ఎక్కువగా తన భార్య శోభిత గురించి ఎక్కడ చూసినా చెబుతున్నారు. దీంతో సమంత నుంచి విడిపోయినప్పటి నుంచి సమంతా అభిమానులు నాగచైతన్యపై కాస్త కోపంగానే ఉన్నారు. ఇటీవలే నాగచైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా తన భార్య శోభిత గురించి చెబుతూ ప్రశంసలు కురిపించడం జరిగింది.

2 /5

ఇలాంటి సమయంలోనే నాగచైతన్య, శోభిత తల్లిదండ్రులు కాబోతున్నారంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.  త్వరలో శోభిత తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోందని పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా శోభిత వివాహానికి ముందే గర్భవతి అయిందనే విధంగా కూడా వార్తలు వినిపిస్తూ వుండడం గమనార్హం.

3 /5

గతంలో బాలీవుడ్ సెలబ్రిటీలను అనుసరించే శోభిత ఇలాంటి డెసిషన్ తీసుకొందని కూడా  వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటంటే.. గతంలో శోభిత ఒక సినిమా షూటింగ్  సమయంలో భాగంగా బేబీ బంప్ ఫోటోతో ఆకట్టుకున్న ఫోటో వైరల్ గా మారడంతో ఈ విషయాలకు మరింత ఆజ్యం పోసినట్టుగా తెలుస్తోంది.   

4 /5

ఒక బాలీవుడ్ సినిమాలో శోభిత గర్భిణీగా నటించింది. ఆ పాత్రలో ఆమె నటనకు ప్రశంసలు అందుకునేలా చేశాయట. ముఖ్యంగా వెండితెరపైనే కాకుండా ఇప్పుడు నిజజీవితంలో కూడా శోభిత గర్భవతి అనే విధంగా కొన్ని ఊహాగానాలు దారి తీసేలా చేస్తోంది. 

5 /5

మరి ఈ విషయం పైన అటు నాగ చైతన్య కానీ అక్కినేని కుటుంబం కాని ఏ విధంగా అధికారికంగా ప్రకటన చేయలేదని,  ఇదంతా కేవలం రూమర్స్ అని అభిమానులు కొట్టి పారేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.