Anti-Aging Supplements: అందంగా కనిపించాలని ప్రతిఒక్కరూ ఆశపడుతుంటారు. అయితే వయస్సుతో పాటు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఎముకలు బలహీనంగా మారడం, జీర్ణవ్యవస్థ మందగించడం, ముఖంపై వ్రుద్ధాప్య చాయలు వస్తుంటాయి. 40ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ గా, అందంగా కనిపించాలంటే కొన్ని ఫుడ్స్, విటమిన్స్ తీసుకోవాలి. అవేంటో చూద్దాం.
విటమిన్ డి :ఎముకల బలంగా ఉండలంటే కావాల్సినంత కాల్షియం, ప్రొటీన్ అందించాలి. వీటిని గ్రహించడంలో విటమిన్ డి ఎంతో సహాయపడుతుంది. వయస్సు మీదపడిన తర్వాత విటమిన్ డి ఉత్పత్తి తగ్గుతుంది. కాబట్టి అలాంటి వారు విటమిన్ డి పుష్కలంగా ఉన్న ఫుడ్స్ డైట్లో చేర్చుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి తీసుకోవాలి.
విటమిన్ బి 12: విటమిన్ బి12 మనశరీరంలోని లివర్ ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతంది. అంతేకాదు రక్తహీనతను తగ్గిస్తుంది. ఈ విటమిన్ ఎక్కువగా మాంసం, చీజ్, గుడ్లలో పుష్కలంగా ఉంటుంది.శాకాహారులు ఈ విటమిన్ లోపం ఎక్కువగా ఉంటుంది. వైద్యులను సంప్రదించి ఈ విటమిన్ సప్లిమెంట్లను తీసుకోవచ్చు.
కాల్షియం: ఎముకలు, దంతాలు బలంగా ఉంచడానికి కాల్షియం అవసరం. 40ఏళ్ల తర్వాత ఎముకలు బలహీనపడటానికి ప్రధాన కారణం కాల్షియం లోపం. కాబట్టి, 40 సంవత్సరాల తర్వాత, పాలు, పెరుగు, జున్ను, బాదం వంటివి తప్పకుండా మీ డైట్లో చేర్చుకోవాలి.
విటమిన్ సి : విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు..శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి ఎక్కువగా నారింజ, నిమ్మ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ మొదలైన వాటిలో లభిస్తుంది. వీటిని నిత్యం తినడం అలవాటు చేసుకోవాలి.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు :ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బులు,ఇతర అనారోగ్య ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయి.ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు చియాసీడ్స్ వాల్నట్లు చేపలలో లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి.
మెగ్నీషియం: మెగ్నీషియం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఎముకలను బలంగా ఉంచడంతోపాటు రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కండరాలు బలంగా ఉండాలంటే మెగ్నీషియం చాలా అవసరం. మెగ్నీషియం 40ఏండ్ల తర్వాత సప్లిమెంట్లతోపాటు బాదం, ఆకుకూరలు వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.