Allu Arjun counter to mega fans: పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్.. ఏ స్థాయికి చేరుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచస్థాయిలో ప్రస్తుతం ఈ హీరోకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే తన సొంత తెలుగు రాష్ట్రాలలో మాత్రం.. అల్లు అర్జున్ కి..ప్రస్తుతం భారీ ఎత్తున యాంటీ ఫ్యాన్స్ క్రియేట్ అయ్యారు.
పుష్ప సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. తెలుగులోనే కాకుండా ఈ హీరోకి.. హిందీలో కూడా భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. ఇక కేరళలో అయితే ఈయనకున్న ఫాలోయింగ్ చెప్పనవసరం లేదు.
ఇలా దాదాపు ఇండియాలోని ఎన్నో రాష్ట్రాలలో విపరీతమైన అభిమానులను సంపాదించుకున్న ఈ హీరో.. తన సొంత తెలుగు రాష్ట్రాలలో మాత్రం కొంతమంది యంటీ ఫ్యాన్స్ ని కూడా సంపాదించుకున్నారు. ఇందుకు ముఖ్య కారణం అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ కి మధ్య విభేదాలు ఉన్నాయి అని మెగా ఫ్యాన్స్ నమ్మడమే.
గత ఎన్నికల దగ్గర నుంచి.. మెగా అభిమానులు అల్లు అభిమానులు సోషల్ మీడియా సాక్షిగా.. పెద్ద ఎత్తున రచ్చ జరుపుతున్న సంగతి తెలిసిందే. తమ హీరో గొప్ప, అంటే తమ హీరో గొప్ప అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ క్రమంలో అల్లు అర్జున్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతూ.. ఇవి తప్పకుండా మెగా అభిమానులకు కౌంటర్ అనిపించేలా ఉన్నాయి. అసలు విషయానికి వస్తే ఈ మధ్య ఒక ప్రోగ్రాం లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తాను రిలేషన్ షిప్స్ కి చాలా వాల్యూ ఇస్తాను అని.. అవతల వాళ్ళ నిర్ణయాలను ఎంతగానో గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇద్దరి మధ్య.. ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే అది ఆ టాపిక్ వరకే అని.. తన మధ్య ఉన్న రిలేషన్షిప్ లోకి అవి తీసుకురానని చెప్పుకొచ్చారు ఈ హీరో.
అయితే పవన్ కళ్యాణ్ పార్టీని కాకుండా మరో పార్టీని సపోర్ట్ చేసినందుకే మెగా అభిమానులు.. అల్లు అర్జున్ ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఇలా అవతల వాళ్ళ నిర్ణయానికి.. గౌరవం ఇస్తాను అని.. రిలేషన్ షిప్ లోకి భిన్నభిప్రాయాలు తీసుకోరానని.. చెప్పడంతో.. ఇది తప్పకుండా మెగా అభిమానులకు అల్లు హీరో ఇచ్చిన కౌంటర్ అంటూ.. ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.